»   » గే సెక్స్‌కు....శృతి హాసన్, సిద్ధార్ధ మద్దతు

గే సెక్స్‌కు....శృతి హాసన్, సిద్ధార్ధ మద్దతు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వలింగ సంపర్కం (గే సెక్స్) చట్ట విరుద్ధం అంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు తెలుగు సినిమా తారలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐపిసి సెక్షన్ 377 ప్రకారం గే సెక్స్ చట్ట విరుద్ధం అంటూ సుప్రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో.....తెలుగు సినిమా తారలు సిద్ధార్థ, శృతి హాసన్, రాహుల్ రావింద్రన్, లావణ్య త్రిపాఠి, చిన్మయి తదితరులు కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసారు.

ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉండే హీరో సిద్ధార్థ పలు విషయాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో వెల్లడిస్తుంటారు. స్వలింగ సంపర్కంపై కోర్టు తీర్పుపై షాకైన సిద్ధార్థ 'అలాంటి లక్షణాలతో పుట్టినవారు అలా చేయడం సహజమే. అంత మాత్రాన అది నేరం అవుతుందా? మేరా భారత్ కహాన్? ఇది చాలా సాడ్ న్యూస్. ' అంటూ ట్వీట్ చేసాడు. ఇలాంటి తీర్పు లెస్బియన్ష్, గే, బై సెక్సువల్స్, ట్రాన్స్ జెండర్లకు అన్యాయం చేయడమే అని అభిప్రాయ పడ్డారు సిద్ధార్థ.

ఇక హీరోయిన్ శృతి హాసన్ తన ట్విట్టర్ పేజీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ....కోర్టు తీర్పు న్యాయంగా అనిపించడం లేదంటూ...స్వలింగ సంపర్కులకు మద్దతుగా వ్యాఖ్యాలు చేసింది. మరో తెలుగు హీరో రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ....'వే ఆఫ్ లైఫ్ అనేది మరోసారి నేరంగా మారింది అంటూ స్వలింగ సంపర్కుల విషయంలో కోర్టు తీర్పును ఖండించారు.

ఇక 'దూసుకెళ్తా' హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ...ముందు రేపులు జరుగకుండా సుప్రీం కోర్టు కఠిన చర్యలు తీసుకోవాలి. స్వలింగ సంపర్కుల వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదు అనే విధంగా మాట్లాడింది. సింగర్ చిన్మయి కోర్టు తీర్పుపై స్పందిస్తూ....ఇలాంటి తీర్పు ఇవ్వడం న్యాయం కాదంటూ వ్యాఖ్యానించింది.

English summary
Many Telugu actors are disappointed with Supreme Court's verdict on criminalising homosexuality. On Wednesday, the court has upheld IPC Section 377 that criminalises gay sex.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu