సిద్ధార్థతో పీకల లోతు ప్రేమలో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్
సిద్ధార్థ, కమల్ హాసన్ కూతురు, నటి శృతి హాసన్‌ల మధ్య ప్రేమ వ్యవహారం పతాక స్థాయికి చేరుకుంది. పరస్పర అవగాహనకు అప్పుడే వారు సహజీవనం చేయడం ప్రారంభించారు. వారిద్దరు తమ ప్రేమ వ్యవహారాన్ని కమల్ హాసన్ నుంచి కూడా దాచడం లేదు. వారికి కమల్ దీవెనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వారు కలిసి జీవించాలని అనుకుంటున్నారని, ఎప్పుడూ గొడవ పడకుండా - దురవగాహన చేసుకోకుండా ఉండడానికి వీలుగా సహజీవం చేయాలని అనుకుంటున్నారని, శ్రుతి సిద్ధార్థతో ప్రేమలో పూర్తిగా తడిసిపోయిందని, బాలీవుడ్‌ను వదిలేసి దక్షిణాదికి మారడానికి కూడా సిద్ధంగా ఉందని, ఐదు మంచి ఆఫర్లను కూడా తిరస్కరించిందని అంటున్నారు.
సిద్ధార్థను ఎంపిక చేసుకోవడం పట్ల కమల్ హాసన్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. శ్రుతిని కలుసుకోక ముందే నటుడిగా సిద్ధార్థను కమల్ చాలా ఇష్టపడేవాడు. శ్రుతి కొత్త పాటలు రాస్తోంది. కొత్త కాంపోజిన్స్‌లో మునిగిపోతుంది. ఇదంతా సిద్ధార్థతో బంధం గట్టిపడాలనే ఆమె చేస్తోందట. సిద్ధార్థ తన బాల్య స్నేహితురాలు మేఘనను ఇంతకు ముందు పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో 2006లో విడిపోయాడు.


Click it and Unblock the Notifications











