టుడే రిలీజ్...సిద్దార్ద 'బావ' స్టోరీ పాయింట్ ఏమిటి?
ఈ రోజు రిలీజ్ అవుతున్న సిద్దార్ధ తాజా చిత్రం "బావ". ఈ చిత్రం...కోనసీమలోని రెండు అందమైన పల్లెటూళ్ల నేపథ్యంలో జరిగే ప్రేమకథగా రూపొందించారు. వీరబాబు (సిద్ధార్థ్) హుషారైన కుర్రాడు. ఎప్పుడూ నలుగురు స్నేహితులని వెంటేసుకొని తిరుగుతుంటాడు. వరలక్ష్మి (ప్రణీత) అతని మరదలు. చిన్నప్పటి నుంచి తెలుసున్నా వయస్సు వచ్చే సరికి వారిద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. అయితే వీరబాబు తండ్రి సీతారాముడు (రాజేంద్రప్రసాద్) అప్పటి వరకూ దాచిపెట్టిన కొన్ని నిజాలను బయటపెట్టడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ నిజాలేంటి? వీరబాబు-వరలక్ష్మిల ప్రేమ ఫలించిందా? లేదా? అనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి.
రాముడు, సీతలాంటి బావా మరదళ్ల మధ్య రావణాసురుడిలాంటి ఓ పాత్ర ప్రవేశిస్తుంది. అతను పెట్టే సమస్యలను, అవరోధాలను హీరో ఎలా అధిగమించి తన మరదలుని దక్కించుకుంటాడన్నది ఈ చిత్ర కథాంశం అంటున్నారు దర్శకుడు రాంబాబు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రాజేంద్రప్రసాద్, సిద్ధార్థ నటిస్తున్నారు. అలాగే తన కొడుక్కి స్నేహితుడిలా, తండ్రిలా, గురువులా ఉంటూ, ఆ కొడుకు ప్రేమ కోసం రాజేంద్రప్రసాద్ ఏం చేశారన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి, కొడుకు ఇలాగే ఉండాలని కోరుకుంటారు అంటున్నారు.ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: చక్రి, ఫొటోగ్రఫీ: అరవింద్ కృష్ణ, సమర్పణ:సందీప్.ఎమ్.ఎల్.పద్మకుమార్‌చౌదరి, సంగీతం: చక్రి దర్శకత్వం: రాంబాబు


Click it and Unblock the Notifications