For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆవకాయ బిర్యాని' దర్శకుడు నెక్స్ ఆ రొమాంటిక్ హీరోగా...

    By Srikanya
    |

    'ఆవకాయ బిర్యాని' చిత్రంతో పరిచయమైన అనీష్ కురవిల్లా తన నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేసుకుంటున్నారు.ఈ సారి హీరోగా సిద్దార్ధను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని సిద్గార్ధే స్వయంగా కన్ఫర్మ్ చేసారు.'ఆవకాయ బిర్యాని' చిత్రం కమర్షియల్ గా ఫెయిలైనా మంచి ఎటెమ్ట్ అనే పేరు తెచ్చుకుంది. చూసిన ప్రతీ ఒక్కరూ మాల్గుడీ డేస్ లాగ ఉందని మెచ్చుకున్నారు. అది దృష్టిలో పెట్టుకునే సిద్దార్ధ డేట్స్ ఇవ్వటం జరిగింది. ఇక హీరోయిన్ ఎవరు..ఎవరు నిర్మిస్తున్నారు వంటి వివరాలు మాత్రం బయిటకు రాలేదు.

    ఇక సిద్ధార్ద హీరోగా నటించిన '180' చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఇక '180' చిత్రం గురించి చెబుతూ... ఒక జీవితంలాంటి సినిమా ఇది. 'నిన్నటి గురించి ఆలోచన లేదు. రేపటి గురించి భయం లేదు. ఈ రోజే నాకు ముఖ్యం' అనే కుర్రాడి కథ. ఇంచుమించు నా వ్యక్తిగత స్వభావం కూడా ఇలాగే ఉంటుంది. చాలా రోజులుగా నేను నమ్ముతున్న ఫిలాసఫీ ఇది. స్వతహాగా నా జీవితాన్ని పోలివున్న కథలో నటిస్తుండటం కొత్త అనుభవాన్నిస్తోంది. దర్శకుడిగా తొలి చిత్రమే అయినా.. ఎంతో అనుభవంతో చిత్రాన్ని రూపొందించారు జయేంద్ర' అన్నాడు.

    English summary
    Siddarth has signed a new film under Anish Kurivilla direction.Anish, who has earlier directed Avakay Biryani film is going to direct again. However, the film did not fare well at the Box-office and Anish has been left as one film-director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X