సిద్దార్ద 'బావ' లాంటి సినిమా ఎవరూ చూసుండరు
ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాను ఎవరూ చూసి ఉండరు. గోదావరి జిల్లాల్లో మంచి వరిపైరున్న కాలంలో చిత్రించాం. ఎటుచూసినా పచ్చగా కన్నుల పండువగా కనిపిస్తుంది అంటూ ఉద్వేగంగా 'బావ' చిత్రం గురించి నిర్మాత ఎం.ఎల్.కుమార్‌చౌదరి చెప్పుకొచ్చారు. సిద్దార్ధ, ప్రణీత జంటగా నటించిన 'బావ' చిత్రం రేపు (అక్టోబర్ 29) విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాకు చిత్రం విశేషాలు చెప్పుకొచ్చారు. "బావ సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది. వినోదం ప్రధానంగా ఉంటుంది. మంచి కుటుంబకథా చిత్రమిది. భావోద్వేగలకు పెద్ద పీట వేశాం. పల్లెటూర్లలో అబ్బాయిలు కాలేజీల దగ్గరికెళ్ళి అమ్మాయిలను ఏడిపించడం, పంటి మీద గోదారి దాటడం వంటివన్నింటినీ చాలా సరదాగా చిత్రించాం. సినిమా మొత్తం హుషారుగా సాగుతుంది.
హుషారైన తండ్రీకొడుకులు "రాజేంద్రప్రసాద్ 'బావ' కథ విని తండ్రి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. ఆయన ఆ పాత్ర చేయడం నిజంగా సినిమాకు పెద్ద ఎసెట్. హీరో తండ్రి పాత్రలో ఆయన నటనను 'ఆ నలుగురు'లో చూశాం.దాన్ని మించే రీతిలో ఈ సినిమాలో కనిపిస్తారాయన. 'బొమ్మరిల్లు'లో సిద్ధార్థను కొడుకుగా చూశాం. సిద్ధు గత చిత్రాలన్నింటికీ భిన్నంగా ఉంటుందీ సినిమా. ఇంటర్వెల్ అయ్యాక ఈ తండ్రీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ కదిలిస్తాయి. యువతను అన్ని విధాలా ప్రతిబింబించే యువకుడిగా సిద్ధార్థ్, ఆయన అల్లరితనం, చిలిపి పనులు, అందుకు ఏమాత్రం తగ్గని తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్... ప్రతి ఒక్కరి మెప్పూ పొందుతారు.అన్నారు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: చక్రి, ఫొటోగ్రఫీ: అరవింద్ కృష్ణ, సమర్పణ:సందీప్.


Click it and Unblock the Notifications











