ఎన్ని అడ్డంకులు వచ్చినా సిద్ధార్థ్ 'బావ' సూపర్ హిట్టైంది
'బావ' విడుదలైన నాలుగో రోజు నుంచి తుఫాను మొదలైంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మా 'బావ'ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ బాగా రన్ అవుతోంది. 'బావ' విజయానికి కారణం దర్శకుడు రాంబాబు, సిద్ధు, రాజేంద్రప్రసాద్. సినిమాలో తొలి సగం గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు అంటున్నారు బావ చిత్రం నిర్మాత ఎం.ఎల్.కుమారచౌదరి. నిజానికి మొదటి రోజు మార్నింగ్ షోకే ఈ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా సక్సెస్ మీట్ పెట్టి ఇలా చెప్పటం పరిశ్రమ వర్గాల్లో నవ్వులు కురిపిస్తోంది. ఈ సక్సెస్ మీట్ ని నిజమని నమ్మి ఎవరైనా ధియోటర్ కి వెళ్ళతారనే ఆశతో పెట్టి ఉండవచ్చు కానీ ఆ రేంజి ప్లాప్ సినిమాని మాత్రం ఎవరూ ప్రమోట్ చేయలేరని కామెంట్ చేస్తున్నారు. అలాగే దర్శకుడు రాంబాబు కూడా..."అక్టోబర్ 29న ఈ సినిమాను విడుదల చేశాం. విడుదలై వారం రోజులే అయింది. వినోదం ప్రదానంగా సాగే ఈ సినిమాలో సిద్ధు రూరల్ బోయ్ గా కొత్త గెటప్ లో అలరిస్తున్నాడు. రాజేంద్రప్రసాద్, ఆహుతి ప్రసాద్ తదితరులందరూ సినిమా విజయంలో భాగస్వామ్యులే. నేను దీపావళి రోజు పుట్టాను. 'బావ' ఈ ఏడాది నాకు పుట్టిన రోజు బహుమతి అవుతోంది" అని చెప్పుతున్నారు అదీ సంగతి.


Click it and Unblock the Notifications











