సిద్దార్ద సరసన శ్రుతి హాసన్..
కమల్ హాసన్ కుమార్తెగా లక్ చిత్రంతో తెరంగ్రేటం చేసిన శ్రుతి హాసన్ త్వరలో తెలుగు తెరను పలకరించనుంది. సిద్దార్ద హీరోగా రాఘవేంద్రరావు కుమారుడు కె.సూర్య ప్రకాష్ రూపొందించనున్న పాంఠసి చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేయనుంది. ఇప్పటికే ఆమె ఈనాడు చిత్రం ప్రోమో ద్వారా పాపులర్ అయింది. ఈ చిత్రం అక్టోబర్ ఇరవై ఒఖటి నుంచి ప్రారంభంకానుంది. అలాగే కమల్‌తో సన్నిహితంగా ఉండే ప్రముఖ దర్శకులొకరు తన చిత్రంలో శ్రుతిని నటింపజేయాలనుకొంటున్నారట.
ఇక ఓయ్ చిత్రం తర్వాత సిద్దార్ధ మరే చిత్రం కమిట్ కాకుండా ఎదురు చూస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతంలో ఇప్పటికే పాటలు రికార్డింగ్ పూర్తయ్యింది. కథ కూడా పూర్తి స్క్రిప్టు తో జె.కె.భారవి డైలాగులతో రెడీ అవుతోంది. దర్శకుడు ప్రకాశరావు ప్రస్తుతం హీరోయిన్ ఎంపికలో ఉన్నారు. కెమెరా వర్క్ కి మంచి ప్రాధాన్యత ఉండటంతో భిళ్ళా చిత్రానికి కెమెరా ఇచ్చిన సుందర్ రాజన్ ని ఎంపికచేసారు.


Click it and Unblock the Notifications











