బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం..కొంచెం కష్టం, ఓయ్ అంటూ దూసుకుపోతున్న సిద్దార్ధ తాజాగా రవిబాబు దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిటయ్యారని సమాచారం. అయితే ఆ చిత్రం హృతిక్ రోషన్ హీరోగా చేసిన లక్ష్య చిత్రానికి రీమేక్ గా ఉండనుందని అంటున్నారు. కథ ప్రకారం కోటీశ్వరుడు కొడుకైన హీరో డిగ్రీ పూర్తి చేసి బద్దకంగా తిరుగుతూ ఉంటూంటాడు.అయితే అతని తండ్రి ఆర్మీలో జాయిన్ అయితే జీవిత పాఠాలు నేర్చుకుని సెటిల్ అవుతాడని భావిస్తాడు. దాన్ని హీరో ఏక్సెప్ట్ చేసి ఏం చేసాడన్నది మిగతా కథ ఉంటుంది. ఈ స్క్రిప్టు సిద్దార్దకి బాగా నచ్చిందని, అందుకే మరో ఆలోచన లేకుండా సైన్ చేసానని చెప్తున్నాడు. ఇక ఈ పాత్ర కోసం సిద్దార్ధ సిక్స్ పాక్స్ బాడీని ట్రై చేయనున్నాడు. అమీర్ ఖాన్ (గజనీ చిత్రానికి)పనిచేసిన ఫిజికల్ ట్రైనర్ ని సిద్దార్ధ నియమించుకున్నారు. దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ తో సుంకర మధు మురళి ఈ చిత్రాన్ని నిర్మించటానికి ప్లాన్ చేస్తున్నారు.