ప్రేమలో పడ్డ సిద్ధార్థ!!!
నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ ప్రేమాయణం నడుపుతున్నట్టు బాలీవుడ్ చెవులు కోసుకుంటోంది. సిద్ధార్థగారు ప్రేమాయణం నడుపుతున్నది రంగ్ దే బసంతీ హీరోయిన్ సొహా అలీఖాన్ తోనట. ఇందులో వీరిద్దరూ నటించినా ఇందులో ప్రేమికులుగా నటించలేదు...స్నేహితులుగానే నటించారు. అయినా ప్రేమలో పడ్డారు. షర్మిలా ఠాగూర్, పటౌడీల కూతురు సొహా అలీఖాన్, సిద్ధార్థ ప్రేమలో పడడం విచిత్రమే. ఇంకో విశేషమేమంటే కరీనాతో ప్రేమాయణం నడుపుతున్న సైఫ్ అలీఖాన్ సోదరే సొహా అలీఖాన్. సినిమాలలోనూ అన్నతో సమానంగా నటిస్తున్న సొహా ప్రేమాయణంలోనూ అన్నకు పోటీగా రంగంలోకి దిగిందన్నమాట. మరో విశేషమేమంటే సిద్ధార్థగారూ తన భార్యకు ఇటీవలే విడాకులు ఇచ్చాడట.


Click it and Unblock the Notifications