బ్రహ్మానందం సెకండ్ హీరో( 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' ప్రివ్యూ)
హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టు లేకపోయినా వరస సినిమాలతో దూసుకుపోతున్న హీరో సిద్దార్ధ. తమిళ,తెలుగు భాషల్లో అతనికి మార్కెట్ ఉండటం ప్లస్ అవుతోంది. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో రూపొంది ఈ రోజు విడుదల అవుతున్న చిత్రం 'సమ్‌థింగ్ సమ్‌థింగ్'.
ఇందులో సిద్దార్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగి . అమ్మాయిలతో మాట్లాడటానికి కూడా భయపడే కుర్రాడు. అతన్ని ఓ లవ్ గురు లవర్‌బాయ్‌గా మారుస్తాడు. ఆ ఉత్సాహంతో ఓ సందర్భంలో ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి అతని వైపు తిరిగి చూస్తుంది. అప్పుటి వరకూ 'ఓకే'. మళ్లీ రెండోసారి సిద్దార్ద వైపు తిరిగి చూడాల్సిన అవసరం ఆ అమ్మాయికి వస్తుంది. తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా.
ఈ సినిమా ప్రధానంగా మూడు పాత్రల మధ్య జరుగుతుంది. సిద్దార్ధకు ప్రేమ పాఠాలు చెప్పే లవ్‌గురు పాత్రను బ్రహ్మానందం చేశారు. యువతుల మనస్తత్వం ఏమిటి, వారితో ఎలా మాట్లాడాలి లాంటి విషయాలు ఆయన సిద్దార్ధ బోధిస్తారు.
హన్సిక మాట్లాడుతూ... ''దేనికైనా రెడీ' తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్న నా చిత్రమిదే. 'ఓ మై ఫ్రెండ్' తర్వాత సిద్ధార్థ్‌తో కలిసి నటిస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది''అన్నారు .
దర్శకుడు మాట్లాడుతూ ''తెలుగులో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకొంటున్నాను. ఇప్పుడు కుదిరింది. ప్రేమ, వినోదం, కుటుంబ అనుబంధాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో బ్రహ్మానందం ప్రేమ్‌జీ అనే లవ్‌గురు పాత్రలో కనిపిస్తారు. ఆయన దగ్గర సిద్ధార్థ్ ప్రేమ పాఠాలు నేర్చుకొనే విధానం వినోదం పంచుతుంది''అన్నారు.
సిద్ధార్థ్ మాట్లాడుతూ ''నేను నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో సమ్‌థింగ్ సమ్‌థింగ్... పాటంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటనే నా సినిమాకి పేరుగా నిర్ణయించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ప్రేమకథ ఇది. రజనీకాంత్, కమల్‌హాసన్‌లాంటి హీరోలతో సినిమాలు తీసిన దర్శకుడు సుందర్.సి. ఆయన తెలుగులో తొలి సినిమా చేస్తుండడం, అందులో నేను నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో నాతో పాటు బ్రహ్మానందం కూడా ఓ హీరోనే. ఆయనతో నేను కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి''అన్నారు.
బ్యానర్ :శ్రీ లక్ష్మీగణపతి పిక్చర్స్
నటీనటలు: సిద్దార్ధ, హన్సిక, బ్రహ్మానందం,సుధ, వేణుమాధవ్, గౌతంరాజు, గణేష్ వెంకటరామన్ తదితరులు
ఛాయాగ్రహణం: గోపీ అమర్‌నాథ్,
సంగీతం: సత్య,
పాటలు: వనమాలి.
కళ: గురురాజ్,
రచన: వెలిగొండ శ్రీనివాస్.
నిర్మాతలు : బి.సుబ్రహ్మణ్యం, ఎన్.సురేష్


Click it and Unblock the Notifications











