Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సూర్య ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్ధ, శృతి హాసన్ జంటగా...
సిద్ధార్ధ హీరోగా కోవెలమూడి ప్రకాష్ దర్శకుడిగా ఆ మధ్య ఓ చిత్రం లాంఛనంగాప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం షూటింగ్ ఆదివారం రామోజీఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ (ఎబోడ్) సంస్థ నిర్మిస్తోంది.ముహూర్తం సన్నివేశాన్ని సిద్ధార్థ, శ్రుతి హాసన్, బేబి శ్రియాశర్మలపై చిత్రించారు. ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్‌నిచ్చారు. క్రిష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక సిద్ధార్థ్ సరసన కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్ ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమవుతోంది.
ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ "ప్రేక్షకుల్ని వూహాలోకంలో విహరింపజేసే ఫాంటసీ కథ ఇది. సిద్ధార్థ సరికొత్తగా కనిపిస్తాడు. శ్రుతి పాత్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంకో నాయిక ఎంపిక జరగాల్సి వుంది. అరగంట పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. సాంకేతికంగా అన్ని రంగాల కృషి తెరమీద కనిపించే సినిమా అవుతుంద"ని చెప్పారు. "మంచి ప్రణాళిక, దానికి తగ్గ అంకిత భావంతో కృషి చేసే యువకుడు ప్రకాష్. ఆయన చెప్పిన కథ నచ్చింది. మంచి గుర్తింపును తెచ్చిపెట్టే సినిమా అవుతుంద"ని సిద్ధార్థ అన్నారు.
అందమైన ఫాంటసీ కథతో తెలుగు తెరకు పరిచయం కావడం పట్ల శ్రుతి హర్షాన్ని వ్యక్తం చేసింది. "స్క్రిప్టు మొత్తం చదివాను. జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందిస్తార"ని రాజమౌళి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ.జె.మేయర్, కెమెరా: సౌందర్‌రాజన్, మాటలు: జె.కె. భారవి, రమేష్ సామల, కూర్పు: శ్రావణ్, కళ: భూపేష్ ఆర్. భూపతి, కాన్సెప్ట్ ఆర్టిస్ట్: రాజ్గోలే, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర. ఇక సిద్దార్ధ కొంచెం ఇష్టం..కొంచెం కష్టం అనంతరం చేస్తున్న చిత్రం ఇదే. అలాగే శ్రుతి హాసన్ లక్ చిత్రం అనంతరం సినిమా కూడా ఇదే.