Siddhu Jonnalagadda: డీజే టిల్లు నెక్ట్స్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా, అందులో సిద్ధూ ఎలా ఉండబోతున్నాడంటే?
Siddhu Jonnalagadda: సిద్ధూ జొన్నలగడ్డ.. ఈ పేరు చెప్పడం కంటే డీజే టిల్లు అని చెబితే ప్రతీ ఒక్కరూ ఈజీగా గుర్తు పడతారు ఈ హీరోను. కెరియర్ తొలి నాళ్లలో సిద్ధూ జోష్, ఆరెంజ్, భీమిలీ కబడ్డీ జట్టు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు. కానీ ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బాయ్ మీట్స్ గర్ల్, గుంటూర్ టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింత గాథ వినుమా వంటి చిత్రాల్లో నటించాడు.
కానీ ఈ చిత్రాలు ఏవీ తీసుకురాని పేరును డీజే టిల్లు సినిమా తీసుకు వచ్చింది. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్టు అయిన ఈ చిత్రంలో సిద్ధూ జొన్నలగడ్డ రేంజ్ యే పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత టిల్లు - 2సినిమాను ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తవగా.. సిద్ధూ జొన్నలగడ్డనే హీరోగా మరో సినిమాలో నటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డిజైనర్ గా, స్టైలిస్ట్ గా, లిరిక్ రైటర్ గా, పుస్తక రచయితగా పేరు తెచ్చుకున్న నీరజ కోన నూతన దర్శకురాలిగా పరిచయం అవ్వబోతున్నారు.

నీరజ కోన, సిద్ధూ జొన్నలగడ్డ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి "తెలుసు కదా" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ ను ఈరోజు తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సిద్ధూ చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా వైట్ అండ్ వైట్ డ్రెస్సులో అదిరిపోయే లుక్కులో కనిపించాడు. తెలుగులో ఎన్నెన్నో సూపర్ హిట్టు చిత్రాలను తెరకెక్కించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ చిత్రం కావడం గమనార్హం. టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమా చాలా రిచ్ గా నిర్మించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వివేక్ కూచిబొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తెలుసు కదా సినిమా ఫుల్ ప్రేమకథా చిత్రం అని సమాచారం. ప్రేమతో పాటు ఈ చిత్రంలో పలు సామాజిక అంశాలు కూడా జతచేర్చామని చిత్ర బృందం వెల్లడిస్తోంది. స్నేహంతో పాటు కుటుంబం, త్యాగం, ప్రేమ అన్ని అంశాల గురించి ఈ సినిమాలో హైలెట్ చేసినట్లు కూడా తెలిపారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారట. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిలతో సిద్ధూ జొన్నలగడ్డ రొమాన్స్ చేయనున్నారు. రాశీ ఖన్నా ఇప్పటికే తెలుగులో చాలా చిత్రాలు చేయగా.. శ్రీనిధి శెట్టికి మాత్రం తెలుగులో ఇది రెండో చిత్రమే. ముందుగా సైంధవ్ సినిమాతో విక్టరీ వెంకటేషన్ సరసన నటించిందీ క్యూట్ బ్యూటీ.

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా.. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా రాబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నారు. అయితే తాజాగా విడుదల అయిన టైటిల్, టైటిల్ టీజర్ కు అనూహ్య స్పందన వస్తోంది. అందరిలోనూ తెగ ఆసక్తి నెలకొల్పుతున్న తెలుసు కదా సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











