Tillu Square Release Date: రాధికను మించిపోయిన డీజే టిల్లు.. ప్లానింగ్ అంటే ఇదిరా బాబూ!
డీజే టిల్లు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకున్నాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. కామెడీ టైమింగ్ తో పాటు అద్భుతమైన డైలాగ్ డెలివరీ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. రాధికా, రాధికా అంటూ ఆయన చేసిన హడావుడికి థియేటర్లు మొత్తం దద్దరిల్లిపోయాయి. ఆ సినిమాలోని పాటలు, డైలాగ్ లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటేనే ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈయన చాలా ఏళ్ల క్రితమే సినీ రంగంలో అడుగు పెట్టినప్పటికీ... డీజే టిల్లు సినిమాతో ఒకేరోజులో స్టార్ హీరో అయిపోయాడు.
2009లో నాగ చైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమాలో ఓ క్యారెక్టర్ రోల్ లో కనిపించాడు సిద్ధూ. ఆ తర్వాత ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, బాయ్ మీట్స్ గర్ల్, గుంటూర్ టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా వంటి అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఆయనకు అంతగా క్రేజ్ రాలేదు. కానీ డీజే టిల్లు సినిమాతో మాత్రం అందరి కళ్లల్లో పడ్డాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో... అదే ఊపులో టిల్లు స్క్వేర్ అనే సినిమాతో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. డీజే టిల్లుకు సీక్వెల్ గా టిల్లు 2 తో అలరించేందుకు సిద్ధం అయ్యాడు.

మొదటి సినిమాలో నేహా శెట్టి రాధికగా ఇరగదీయగా.. ఈసారి మాత్రం అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా కనిపించబోతున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకాలపై ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అదేంటీ అనుకుంటున్నారా... ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
మరోసారి నవ్వులు పూయిస్తూ అల్లరి చేసేందుకు, చరిత్ర సృష్టించేందుకు టిల్లు స్క్వేర్ వచచేస్తున్నాండూ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేశారు. అలాగే మొదటి పార్ట్ ను మంచి వినోదాన్ని పంచుతాడని పేర్కొన్నాడు. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోనున్నాడని వివరించారు. అయితే ఈ విషంయ తెలుసుకున్న అభిమానులు అంతా తెగ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెట్టడం చాలా బాగుంది అంటూ.. ఇదిరా బాబు ప్లానింగ్ అంటే కామెంట్లు చేస్తున్నారు.

ముందుగా ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో.. విడుదల తేదీని వాయిదా వేశారు. ప్రస్తుతం సినిమా పనులన్నీ పూర్తి అయ్యాయి. కానీ ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉండంతో సినిమాను ఇప్పుడే రిలీజ్ చేయట్లేరు. డిసెంబర్ లో విపరీతమైన పోటీ ఉండగా.. సంక్రాంతి బరిలోనూ చాలానే సినిమాలు నిలిచాయి. ఇదంతా అయిపోయాకే తమ చిత్రాన్ని సింగిల్ తీసుకు రావాలని ప్లాన్ చేసుకున్న చిత్రబృందం ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది.


Click it and Unblock the Notifications











