Tullu Square కారులో రొమాంటిక్ డోస్ పెంచిన సిద్దూ, అనుపమ..టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిందిగా!
డీజే టిల్లు సినిమాతో సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి సృష్టించిన బాక్సాఫీస్ సంచలనం అంతా ఇంతా కాదనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. చిన్న చిత్రంగా, ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌లోకి కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే డీజె టిల్లుకు సీక్వెల్‌గా ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా టిల్లు స్క్వేర్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ..
శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న టిల్లు స్కేర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. డీజే టిల్లు చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న సిద్ధు, అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి, యువ ప్రతిభావంతుడు సిద్ధు అందించిన ఈ కొత్తతరం కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా డీజే టిల్లు పాత్రను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. ప్రస్తుతం ఈ యువనటుడు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్‌తో వస్తున్నారు.

డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి అద్బుతంగా తెర మీద రాణించింది. అయితే టిల్లు స్క్వేర్ సినిమాలో ఆమె మిస్ అయింది. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల్లో సిద్దూతో అమీ తుమీ తేల్చుకొనేందుకు అనుపమ పరమేశ్వరన్ రెడీ అయ్యింది. సిద్దూతో కలిసి రెట్టింపు వినోదాన్ని పంచడానికి అనుపమ పరమేశ్వరన్ సిద్దమయ్యారు.
టిల్లు స్క్వేర్ సినిమానను సెప్టెంబర్ 15, 2023 సంవత్సరంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సిద్ధు, అనుపమ పరమేశ్వరన్ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని, థ్రిల్ ని అందిస్తుందనే విషయం పోస్టర్‌తో స్పష్టమైంది. కారులో సిద్దూ, అనుపమ ముద్దు ముచ్చట యూత్‌కు గిలిగింతలు పెట్టేలా ఉంది. రిలీజ్ డేట్ పోస్టర్ ఈ సినిమా రొమాంటిక్ గ్రాఫ్‌ను పంచేసింది.
డీజే టిల్లు సినిమా భారీ సక్సెస్‌తో టిల్లు స్క్వేర్ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు విడుదల తేదీ ప్రకటనతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. నూతన దర్శకుడు మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
నటీనటులు: సిద్ధు, అనుపమ పరమేశ్వరన్ తదితరులు
దర్శకత్వం: మల్లిక్ రామ్
డీఓపీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
రిలీజ్ డేట్: 2023-09-15


Click it and Unblock the Notifications











