DJ Tillu Twitter Review: డీజే టిల్లుకు షాకింగ్ టాక్.. ప్లస్ మైనస్‌లు అవే.. ఫైనల్ రిపోర్ట్ ఇదే

కొంత కాలంగా తెలుగులో ఫన్ ఎంటర్‌టైనర్ మూవీలు చాలా తక్కువగా వస్తున్నాయి. అందుకే అలాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో అందరి దృష్టినీ ఆకర్షించిన యూత్‌ఫుల్ మూవీగా నిలిచింది 'డీజే టిల్లు'. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం వేచి చూస్తోన్న టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాపై క్రమంగా అంచనాలు ఏర్పడ్డాయి.

దీంతో ఈ మూవీ ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే దీనికి షాకింగ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా ఎలాంటి అభిప్రాయాలు చెబుతున్నారో ఓ లుక్కేద్దాం పదండి!

డీజే కొట్టేందుకు వచ్చేసిన టిల్లు

డీజే కొట్టేందుకు వచ్చేసిన టిల్లు

సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమే 'డీజే టిల్లు'. నేహా శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. దీనికి శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ఫిబ్రవరి 12 ఇది విడుదలైంది.

అంచనాలు పెంచేన వీడియోలు

అంచనాలు పెంచేన వీడియోలు

కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'డీజే టిల్లు' మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. కానీ, ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సిద్ధు నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

బిజినెస్ భారీగా.. రిలీజ్ గ్రాండ్‌గా

బిజినెస్ భారీగా.. రిలీజ్ గ్రాండ్‌గా

సిద్దు జొన్నలగడ్డకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'డీజే టిల్లు' మూవీపై అంచనాలు ఉండడంతో రైట్స్‌కు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీని చాలా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

డీజే టిల్లు చిత్రానికి షాకింగ్ టాక్

డీజే టిల్లు చిత్రానికి షాకింగ్ టాక్

సిద్దు జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా వచ్చిన 'డీజే టిల్లు' మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి టాక్ వచ్చింది. ఇది కిక్కిచ్చే మూవీ అంటూ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

'డీజే టిల్లు' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ఔట్ అండ్ ఔట్ కామెడీ నేపథ్యంతో సాగిపోతుందట. మరీ ముఖ్యంగా వన్ లైన్ కామెడీ పంచ్ డైలాగ్‌లు నవ్వులు తెప్పిస్తాయని అంటున్నారు. ఇక, సెకెండాఫ్ మాత్రం యావరేజ్‌గా సాగిపోతుందని చెబుతున్నారు. ఇందులో కూడా కామెడీని ప్రధానంగా తీసుకున్నప్పటికీ అది ఫస్టాఫ్ మాదిరిగా వర్కౌట్ కాలేదని తెలిసింది.

సినిమా ప్లస్‌.. మైనస్‌లు ఇలాగ

సినిమా ప్లస్‌.. మైనస్‌లు ఇలాగ

'డీజే టిల్లు' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో సిద్దు నటన, హీరో క్యారెక్టరైజేషన్, కామెడీ డైలాగ్‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్, కొన్ని పాటలు, నిర్మాణ విలువలు, ఫస్టాఫ్ చాలా బాగున్నాయని అంటున్నారు. అయితే, సెకెండాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదట. అలాగే, కొన్ని సీన్స్ మాత్రం సిల్లీగా ఉన్నాయని సినిమాను చూసిన వాళ్లంతా ట్వీట్లు చేస్తున్నారు.

Recommended Video

DJ Tillu Sequel ? /Sidhu Jonnalagadda Clarifies | Neha Shetty | Filmibeat Telugu
మొత్తంగా సినిమా ఎలా ఉంది?

మొత్తంగా సినిమా ఎలా ఉంది?

ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'గుడ్ లక్ సఖి' మూవీ పూర్తిగా కామెడీ నేపథ్యంతో సాగే ఫన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఫుల్ ఫన్ రైడ్‌తో సాగే ఈ సినిమా ఆద్యంతం సరదాగా సాగిపోతుందట. అయితే, కొన్ని సన్నివేశాలు తేలిపోయినా ప్రేక్షకులకు మజా అందుతుందని తెలుస్తోంది. మొత్తంగా డీజే టిల్లు ఫన్ కోసం చూడొచ్చట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X