twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    DJ Tillu 2: 'డీజే టిల్లు 2'కు హ్యాండ్ ఇస్తున్న హీరోయిన్లు.. సిద్ధు జొన్నలగడ్డ కారణమా?

    |

    టాలీవుడ్ లో ఎప్పటి నుంచో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. అయితే అతని విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం డీజే టిల్లు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించగా.. ఇందులో వారి కెమిస్ట్రీకి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ రావాలని కోరుకున్నారు.

    అందుకనుగుణంగానే సీక్వెల్ అయితే వస్తోంది. కానీ డీజే టిల్లు 2 నుంచి ఒక్కక్కొరుగా తప్పుకుంటున్నారు. సినిమా ప్రారంభంలో డైరెక్టర్ హ్యాండ్ ఇస్తే తాజాగా హీరోయిన్ గా ఓకే అనుకున్నా అనుపమ పరమేశ్వరన్ హ్యాండ్ ఇచ్చింది. దీంతో అలా ఎందుకు జరుగుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

    డీజే టిల్లుతో పాపులర్..

    డీజే టిల్లుతో పాపులర్..

    చిన్న సినిమాగా విడుదలైన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో ఒక్కసారిగా సిద్ధు జొన్నలగడ్డ పేరు మారుమోగిపోయింది. ఎప్పటి నుంచే సినీ ఇండస్ట్రీలో ఉంటున్న సిద్ధుకి ఈ సినిమా సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల మూవీస్ తో ఆకట్టుకున్న సిద్ధు జొన్నల గడ్డ డీజే టిల్లుతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు.

    క్రేజ్ తోపాటు వివాదాలు..

    క్రేజ్ తోపాటు వివాదాలు..

    సిద్ధు జొన్నలగడ్డకు సుమారు 12 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో డిజే టిల్లు ద్వారా అశేషమైన గుర్తింపు లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు. డీజే టిల్లుకు సీక్వెల్ వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి విపరీతమై క్రేజ్ ఏర్పడటంతో పాటు వరుసగా వివాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముందుగా ఈ సీక్వెల్ నుంచి డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకున్నారు.

    డైరెక్టర్ తప్పుకోవడంతో..

    డైరెక్టర్ తప్పుకోవడంతో..

    సిద్ధు జొన్నల గడ్డకు డైరెక్టర్ విమల్ కృష్ణకు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే తదితర విషయాల్లో క్రియేటివిటీకి సంబంధించిన అంశాల్లో మనస్పర్ధలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సిద్ధు జొన్నలగడ్డ అన్ని విషయాల్లో తలదూరుస్తున్నాడని కూడా రూమర్స్ వినిపించాయి. అలాగే విమల్ కృష్ణకు హీరో నాగ చైతన్యను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందునే సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు మరో వార్త హైలట్ అయింది.

    షూటింగ్ తర్వాత..

    షూటింగ్ తర్వాత..

    ఇక డైరెక్టర్ విషయం పక్కన పెడితే డీజే టిల్లు సీక్వెల్ కు తీసుకుంటున్న హీరోయిన్లు కూడా ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు. మొదట్లో డీజీ టిల్లు హీరోయిన్ నేహా శెట్టినే అంతా అనుకున్నారు. కానీ ఆమె గెస్ట్ రోల్ మాత్రమే అని చెప్పారు. తర్వాత గ్లామరస్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్న ఉద్దేశంతో 'పెళ్లి సందD'ఫేమ్ శ్రీలీలను అనుకున్నారు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రవితేజ ధమాకాలో శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే.

    ఒక్కొక్కరు తప్పుకోవడంతో..

    ఒక్కొక్కరు తప్పుకోవడంతో..

    శ్రీలీల తర్వాత భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ ను సంప్రదించిందట డీజే టిల్లు 2 టీమ్. అయితే ఆమె నో చెప్పిందని టాక్. తర్వాత బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ అని

    ప్రకటించారు. కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు అనుపమ కూడా డీజే టిల్లు 2 నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. ఇలా ఒక్కొక్కరిగా డీజే టిల్లు 2 నుంచి తప్పుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

    ఓవరాక్షన్ చూపిస్తున్నాడని..

    ఓవరాక్షన్ చూపిస్తున్నాడని..

    అయితే డీజే టిల్లు నుంచి హీరోయిన్లు ఇలా తప్పుకోవడం.. అందులోనూ షూటింగ్ కాస్తా జరిగాక హ్యాండ్ ఇవ్వడానికి కారణంగా సిద్ధు జొన్నలగడ్డవైపై చూపిస్తున్నారు. డిజే టిల్లు సినిమా ఇచ్చిన మత్తు ఇంకా దిగలేదని, డీజే టిల్లు 2కి సంబంధించిన అన్ని విషయాల్లో సిద్ధు తల దూరుస్తూ యాటిట్యూడ్ తో ఓవారక్షన్ చూపిస్తున్నాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలన్నింటిపై డీజే టిల్లు క్లారిటీ ఇచ్చాడు.

    సినిమాల్లో ట్రై చేయండి..

    సినిమాల్లో ట్రై చేయండి..

    డీజే టిల్లు 2ను 2023 మార్చిలో విడుదల చేస్తామని, ఈ రూమర్స్ పై త్వరలోనే ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా సమాధానం చెబుతానని సిద్ధు జొన్నలగడ్డ తెలిపాడు. మరోవైపు ఈ హీరోయిన్లు తప్పుకోవడంపై ఓ వెబ్ సైట్ ప్రచురించిన కథనంపై ఆ సినిమా నిర్మాత నాగవంశీ స్పందించారు. 'మీకు రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది. స్క్రిప్ట్ రైటర్ గా ఎందుకు ట్రై చేయద్జు' అని నాగవంశీ రిప్లై ఇచ్చారు.

    English summary
    DJ Tillu Siddu Jonnalagadda And Producer Naga Vamshi Gives Clarity On Director And Heroines Quit From DJ Tillu 2 Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X