DJ Tillu OTT: చరిత్ర సృష్టించిన డీజే టిల్లు.. రెండు రోజుల్లోనే పది కోట్లతో గొప్ప రికార్డు

గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాస్య ప్రధానమైన చిత్రాలు చాలా తక్కువగా వస్తున్నాయి. దీంతో అలాంటి సినిమాలు వస్తే ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందిస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'డీజే టిల్లు'. హీరోగా ఎప్పుడో పరిచయమైనా.. సరైన బ్రేక్‌ను అందుకోలేకపోయిన యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. ఇక, ఇటీవలే ఆహాలో విడుదలైన 'డీజే టిల్లు' తాజాగా ఓ రికార్డును కొట్టేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

Recommended Video

DJ Tillu Box Office Collections, ఆ రికార్డు అందుకున్న మొదటి సినిమాగా DJ Tillu | Filmibeat Telugu
‘డీజే టిల్లు’గా సిద్ధు అరాచకం

‘డీజే టిల్లు’గా సిద్ధు అరాచకం

సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కించిన సినిమానే 'డీజే టిల్లు'. నేహా శెట్టి హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేశారు.

భారీగా బిజినెస్.. గ్రాండ్‌ రిలీజ్

భారీగా బిజినెస్.. గ్రాండ్‌ రిలీజ్

సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్నా హీరో సిద్దుకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'డీజే టిల్లు' మూవీ హక్కులకు విపరీతంగా పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అలాగే, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ కూడా దక్కిన విషయం తెలిసిందే.

3 వారాలకూ కలిపి వచ్చిందెంత?

3 వారాలకూ కలిపి వచ్చిందెంత?

మూడు వారాలు పూర్తయ్యే సరికి 'డీజే టిల్లు' భారీ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 81 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 81 లక్షలు, గుంటూరులో రూ. 79 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ. 47 లక్షలతో కలిపి రూ. 14.10 కోట్లు షేర్, రూ. 24.44 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే

వరల్డ్ వైడ్ కలెక్షన్లు రిపోర్టు ఇదే


'డీజే టిల్లు' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.02 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.07 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుంటే మూడు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 17.19 కోట్లు షేర్‌తో పాటు రూ. 30.20 కోట్లు గ్రాస్ సొంతం అయింది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

కామెడీ కమ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'డీజే టిల్లు'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ 3 వారాల్లో రూ. 17.19 కోట్లు రాబట్టింది. దీంతో ఇది హిట్ స్టేటస్‌తో పాటు రూ. 7.69 కోట్లు లాభాలను అందుకుంది.

ఓటీటీలో డీజే టిల్లు స్ట్రీమింగ్

ఓటీటీలో డీజే టిల్లు స్ట్రీమింగ్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'డీజే టిల్లు' మూవీని ఆహా వీడియోలో డిజిటిల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తూ.. కలెక్షన్లను బాగానే రాబడుతోన్నా.. చిత్ర యూనిట్ డేరింగ్ స్టెప్ వేసి దీన్ని మార్చి 4 నుంచి ఇందులో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ కూడా ఈ చిత్రానికి మంచి స్పందన దక్కుతోందని తెలుస్తోంది.

రికార్డును క్రియేట్ చేసిన మూవీ

రికార్డును క్రియేట్ చేసిన మూవీ

'డీజే టిల్లు' మూవీకి ఆహాలో అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, ఇది కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను కూడా పూర్తి చేసుకుంది. తద్వారా ఆహాలో ఈ ఘనతను అందుకున్న మొదటి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు ఆహా టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X