DJ Tillu: మరో సెన్సేషనల్ రికార్డు కొట్టిన డీజే టిల్లు.. తెలుగులోనే నెంబర్ వన్ మూవీగా రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే విడుదలకు ముందే భారీ స్థాయిలో బజ్‌ను ఏర్పరచుకుని హైలైట్ అవుతుంటాయి. తద్వారా ప్రేక్షకులందరినీ థియేటర్లకు రప్పిస్తుంటాయి. అలాంటి వాటిలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'డీజే టిల్లు' ఒకటి. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చి హిట్ అయింది. ఇక, ఇటీవలే ఆహాలో విడుదలైన 'డీజే టిల్లు' తాజాగా మరో అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

‘డీజే టిల్లు'గా సిద్ధు హల్‌చల్

‘డీజే టిల్లు'గా సిద్ధు హల్‌చల్


సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘డీజే టిల్లు'. నేహా శెట్టి హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ కీలక పాత్రలను పోషించారు.

 భారీగా బిజినెస్.. గ్రాండ్‌ రిలీజ్

భారీగా బిజినెస్.. గ్రాండ్‌ రిలీజ్


చాలా ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా హీరో సిద్దుకు పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ ‘డీజే టిల్లు' మూవీ హక్కులకు విపరీతంగా పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. అలాగే, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ కూడా సొంతం అయింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలివే

వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలివే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ‘డీజే టిల్లు' మూవీకి మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో ఈ మూవీ ఎన్నో కోట్లు రాబట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని అన్ని ప్రాంతాల్లో కలుపుకుని దాదాపు రూ. 18 కోట్లు షేర్‌తో పాటు రూ. 32 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత? లాభాలు ఎంత?


రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డీజే టిల్లు'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ ఇప్పటి వరకూ రూ. 18 కోట్లు రాబట్టింది. దీంతో ఇది హిట్ స్టేటస్‌తో పాటు రూ. 8.50 కోట్లు లాభాలను అందుకుంది.

ఓటీటీలో డీజే టిల్లు స్ట్రీమింగ్

ఓటీటీలో డీజే టిల్లు స్ట్రీమింగ్

సిద్దు జొన్నలగడ్డ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘డీజే టిల్లు' మూవీని ఆహా వీడియోలో డిజిటిల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తూ.. కలెక్షన్లను బాగానే రాబడుతోన్నా.. చిత్ర యూనిట్ డేరింగ్ స్టెప్ వేసి దీన్ని మార్చి 4 నుంచి ఇందులో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, ఇక్కడ కూడా ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోందని తెలిసింది.

Recommended Video

DJ Tillu : Sidhu Jonnalagadda Exclusive Interview పుష్ప లాగే టిల్లు.. | Filmibeat Telugu
 మరో రికార్డు కొట్టిన డీజే టిల్లు

మరో రికార్డు కొట్టిన డీజే టిల్లు


సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు' మూవీకి ఆహాలో అదిరిపోయే స్పందన దక్కుతోంది. కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసుకుని రికార్డు సాధించిందీ మూవీ. ఇక, ఇప్పుడు నాలుగు రోజుల్లోనే ఏకంగా 150 స్ట్రీమింగ్ మినిట్స్‌ను అందుకుంది. తద్వారా ఆహాలో ఈ ఘనతను అందుకున్న మొదటి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X