Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్‌కు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఇంతకీ హిట్టేనా అంటే!
గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన చిత్రాలకు సీక్వెల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలాంటివి మరింత హైప్ క్రియేట్ చేసుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా నుంచి అలా వస్తున్న సీక్వెల్ మూవీనే 'టిల్లు స్క్వేర్'.
గతంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'డీజే టిల్లు'కు ఇది కొనసాగింపుగా రూపొందింది. దీంతో ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దీనికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూసేయండి మరి!

టిల్లు గాడు మళ్లీ వచ్చేశాడుగా
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రమే 'టిల్లు స్క్వేర్'. మల్లిక్ రామ్ రూపొందించిన ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు.
అలాంటి కథతోనే వచ్చింది
ఒక అమ్మాయి ప్రేమలో పడి మోసపోయిన కుర్రాడి కథతో 'డీజే టిల్లు' మూవీ వచ్చింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన 'టిల్లు స్క్వేర్' కూడా ఇంచుమించు అదే స్టోరీలైన్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో కొంచెం యాక్షన్, ట్విస్టులు డోస్ పెంచేశారు. ఫలితంగా ఈ చిత్రం మరిన్ని అంచనాలను ఏర్పరచుకుని ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది.
టిల్లు స్క్వేర్ ఫస్టాఫ్ ఇలా
సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీని చూసిన ఓ నెటిజన్ X (ట్విట్టర్) ఖాతాలో ఇలా స్పందించారు. 'టిల్లు స్క్వేర్ ఫస్టాఫ్ బాగుంది. ఇందులో స్టార్ బాయ్ సిద్దు తనదైన యాక్టింగ్, డ్యాన్సింగ్‌తో మిమ్మల్ని మెప్పిస్తాడు. పంచ్ డైలాగులు బాగా పేలాయి. స్టోరీ కాస్త స్లోగా ఉన్నా అసలైన ట్విస్ట్ రివీల్ అయినప్పుడు పంజుకుంది' అని చెప్పుకొచ్చారు.
వాళ్లిద్దరూ మాయ చేశారు
'టిల్లు స్క్వేర్' మూవీని చూసిన మరో నెటిజన్ X (ట్విట్టర్) ఖాతాలో 'టిల్లు స్క్వేర్ మూవీ ఫన్నీగా సాగే రోలర్‌కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. సిద్దు ఎనర్జీ, అనుపమ అందం స్క్రీన్‌పై వెలుగులు నింపింది. వన్ లైనర్ డైలాగులు కట్టి పడేశాయి. కొన్ని సన్నివేశాలు, గ్రాఫిక్స్‌తో నిండిన దృశ్యాలు ఉన్నా.. తెరపై మంచిగా కనిపించింది. నా రేటింగ్ 3/5' అని వెల్లడించారు.
అదొక్కటే మైనస్ అంటూ
సిద్దు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీపై మరో నెటిజన్ 'డీజే టిల్లు మరో ఎంటర్‌టైనర్‌తో మీ ముందుకు వచ్చేశాడు. ఈ మూవీ ఫ్యామిలీ కామెడీతో మొదలై, లిల్లీతో జోకులు, కొంత యాక్షన్, కొన్ని ట్విస్టులు, ఆమె తిరిగి రావడంతో ముగుస్తుంది. సినిమా చాలా స్లోగా ఉండడం మైనస్. సిద్దు వన్ మ్యాన్ షో చేశాడు' అని వివరించారు.
వాటి కోసం చూడాల్సిందే
సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన 'టిల్లు స్క్వేర్' సినిమాను వీక్షించిన ఇంకో నెటిజన్ ఇలా స్పందించారు. 'టిల్లు స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్. నా రేటింగ్ 3.5/5. వినోదం కోసం ఈ సినిమా చేడండి. వన్ లైనర్ డైలాగుల కోసం తప్పకుండా చూడండి. సిద్దు బాయ్ కోసం అయితే మళ్లీ మళ్లీ చూడండి' అంటూ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఆ మూవీతో పోలిస్తే బెటర్
సిద్దు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీపై మరో నెటిజన్ 'టిల్లు స్క్వేర్ మూవీ ఏవరేజ్‌గా ఉంది. కామెడీ చాలా వరకూ వర్కౌట్ కాలేదు. ఫస్ట్ పార్ట్‌తో పోల్చుకుంటే బెటర్ స్టోరీనే కానీ.. కామెడీ సన్నివేశాలను చాలా బలవంతంగా రాసుకున్నట్లు అనిపించింది' అంటూ రాసుకొచ్చారు.
ఓవరాల్‌గా అలాంటి టాక్
మల్లిక్ రామ్ డైరెక్షన్‌లో సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్‌ను బట్టి ఈ సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, ఊహించని విధంగా అందరూ సినిమా స్లోగా ఉందని అంటున్నారు. కానీ, వన్ లైనర్లు హైలైట్ అని చెప్తున్నారు. మరి ఇదే టాక్ కంటిన్యూ అయితే మాత్రం సిద్దు హిట్ కొట్టడం ఖాయం అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











