హీరోయిన్ పుట్టుమచ్చల వివాదం… అందరి మధ్య అలా.. చాలా ధైర్యం కావాలంటూ సిద్దూ సుదీర్ఘ నోట్!

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ మూవీ డీజే టిల్లు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 11న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఓ ఈవెంట్ ద్వారా డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో జరిగిన పుట్టుమచ్చల వివాదం విషయంలో సిద్ధూ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రేక్షకుల ముందుకు

ప్రేక్షకుల ముందుకు

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ మూవీ డీజే టిల్లు చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‏లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ హాజరయ్యి.. విలేకరులతో ముచ్చటించారు.

 అవాయిడ్ చేద్దాం

అవాయిడ్ చేద్దాం

ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజే టిల్లు ట్రైలర్ లో హీరోయిన్ కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని హీరోగా అడగ్గా.. పదహారు అంటూ ఆన్సర్ ఇస్తుంది హీరోయిన్. ఇక ఇదే డైలాగ్ ను గుర్తు చేస్తూ.. ఓ జర్నలిస్ట్ సినిమాలో డైలాగ్ చెప్పారు కదా.. నిజంగానే ఎన్ని పుట్ట మచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా ? అంటూ అడిగాడు. ఈ ప్రశ్నకు హీరో ఇబ్బంది పడుతూ.. ఇది అవాయిడ్ చేద్దాం అంటూ సమాధానం ఇచ్చారు.

 చాలా దురదృష్టకరం

చాలా దురదృష్టకరం

అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సదరు వీడియోను హీరోయిన్ నేహా శెట్టి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా దురదృష్టకరం. అంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్ కు కలిగిన అసౌకర్యానికి నిర్మాత నాగవంశీ క్షమాపణలు చెప్పాడు. ఇలాంటివి జరగడం దురదృష్టకరమే అంటూ రిప్లై ఇచ్చారు.

చాలా కించపరిచే ప్రశ్న

చాలా కించపరిచే ప్రశ్న

అయితే దీనిపై సిద్ధు ఇప్పటి వరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు లేదా తన అభిప్రాయాన్ని పంచుకోలేదు. దీంతో తాజాగా ఆయన తన ట్విట్టర్ లో సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసాడు. ప్రతి ఒక్కరూ ‘నటులను గౌరవించండి' అంటూ ఈ నోట్ ను పోస్ట్ చేశారు. Dj Tillu యొక్క థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా నాపై చాలా కించపరిచే ప్రశ్న (అది అనుకోకుండా అడిగిన ప్రశ్న అని నేను నమ్ముతున్నా) విసిరారు. నా సైలెన్స్ రెస్పాన్స్‌కి కారణం ఏమిటని చాలా మంది నన్ను అడిగారు. నేను చాలా ప్రశాంతంగా మరియు కంపోజ్డ్ పద్ధతిలో ఆ ప్రశ్నను తిరస్కరించాలని అనుకున్నా అందుకే నేను నిగ్రహాన్ని కోల్పోకుండా నిగ్రహంగా ఉండాలని అనుకున్నాను అని పేర్కొన్నారు.

Recommended Video

Actor Siddu Jonnalagadda Exclusive Interview Part 3 | Ma Vintha Gadha Vinuma
చాలా కష్టపడతారు

చాలా కష్టపడతారు

ఇది నటీనటుల పట్ల కొంతమందికి ఉన్న అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తుంది. నటీనటులు సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు చాలా కష్టపడతారు, నిజానికి చాలా కష్టపడతారు. ప్రత్యేకించి మహిళల గురించి చెప్పాలంటే సెట్‌లో దాదాపు వంద మంది వ్యక్తుల ముందు తమ సహనటుడిని ముద్దుపెట్టుకుంటూ ఉంటారు, కొన్నిసార్లు ఒక టెక్నీషియన్ వారి ముఖంలో లైట్ పట్టుకుని ఉంటారు. అలంటి సమయంలో కూడా నటించడానికి చాలా ధైర్యం కావాలి, అలా ధైర్యంగా ఉన్నందుకు మమ్మల్ని గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ ఇలా అగౌరవ పరచవద్దు. మేము కథలు చెబుతాము, వినోదాన్ని అందిస్తాము అలాగే మేము చేసే పనిని బట్టి మన నిజ జీవితంలో కూడా ఉండాలని అనుకోకండి అని చెప్పుకొచ్చారు. నా డీజే టిల్లు సినిమా ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే వచ్చా మా సినిమాలో అన్ని హంగులూ ఉన్నాయి, అందరికీ నచ్చుతుంది... మళ్ళీ కలుద్దాం" అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X