SIIMA అవార్డ్స్: మహేష్ కంటే లీడింగులో పవన్

By Bojja Kumar

pawan-mahesh
హైదరాబాద్ : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA)-2013 వేడుకకు రంగం సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో యుఏఈలోని షార్జా వేదికగా ఈ వేడుక జరుగనుంది. సౌతిండియా సినిమా రంగంలోని ఇండస్ట్రీలైన తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లో తెరకెక్కిన సినిమాలకు పలు కేటగిరీల్లో ఉత్తమ అవార్డులు అందించనున్నారు.

అత్యధిక విభాగాల్లో పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్', మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మేన్' చిత్రాలు పోటీ పోటాగా తలపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ 13 విభాగాలకు నామినేట్ అయి లీడింగులో ఉంది. 11 నామినేషన్స్‌తో మహేష్ బాబు 'బిజినెస్ మేన్', 9 నామినేషన్స్‌తో రాజమౌళి 'ఈగ' ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. బెస్ట్ యాక్టర్ విభాగంలో కూడా పవన్ కళ్యాణకు ఇప్పటి వరుక అత్యధికంగా ఓట్లు వచ్చినట్లు సమాచారం.

తెలుగు విభాగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం అత్యధికంగా 13 విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ యాక్టర్ మేల్(పవన్ కళ్యాణ్), బెస్ట్ యాక్టర్ ఫిమేల్(శృతి హాసన్), బెస్ట్ డైరెక్టర్(హరీష్ శంకర్), బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్(దేవిశ్రీ ప్రసాద్), బెస్ట్ సినిమాటోగ్రాఫర్(జైయనన్ విన్సెంట్), బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్(గణేష్-దేఖో దేఖో గబ్బర్ సింగ్), బెస్ట్ ఫైట్ మాస్టర్(రామ్ లక్ష్మణ్), బెస్టర్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్(సుహాసిని మణిరత్నం), బెస్ట్ విలన్(అభిమన్యు సింగ్), బెస్ట్ ప్లే బ్యాక్ సింగ్ ఫిమేల్(మమతా శర్మ-కెవ్వు కేక), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్(శంకర్ మహదేవన్-ఆకాశం అమ్మాయైతే), బెస్ట్ కమెడియన్ (ప్రభాస్ శీను) విభాగాల్లో పోటీ పడుతోంది.

మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మేన్' చిత్రం 11 విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ యాక్టర్ మేల్(మహేష్ బాబు), బెస్ట్ యాక్టర్ ఫిమేల్(కాజల్), బెస్ట్ డైరెక్టర్(పూరి జగన్నాథ్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్(తమన్), బెస్ట్ సినిమాటోగ్రాఫర్(శ్యామ్ కె నాయుడు), బెస్ట్ ఫైట్ మాస్టర్(విజయ్), బెస్టర్ సపోర్టింగ్ యాక్టర్ మేల్(నాజర్), బెస్ట్ విలన్(ప్రకాష్ రాజ్), బెస్ట్ ప్లే బ్యాక్ సింగ్ ఫిమేల్(సుచిత్ర-సారొస్తారా), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్(తమన్ ఎస్-సారొస్తారా), బెస్ట్ లిరిసిస్ట్(భాస్కర భట్ల-సారొస్తారా) విభాగాల్లో పోటీ పడుతోంది. మరి ఏ చిత్రం ఎక్కువ అవార్డులు దక్కించుకుంటుంది అనేది త్వరలో తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X