»   » SIIMA పార్టీలో సినీ స్టార్స్ సెక్సీగా...(ఫోటోలు)

SIIMA పార్టీలో సినీ స్టార్స్ సెక్సీగా...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA)-2013 వేడుకకు రంగం సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో యుఏఈలోని షార్జా వేదికగా ఈ వేడుక జరుగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‍లోని పార్క్ హయత్ హోటల్‌లో సినీ తారల పార్టీ జరిగింది.

టాలీవుడ్ స్టార్స్ అయిన రవితేజ, రాణా, త్రిష, శ్రీయ, నాని, అల్లరి నరేష్, మధు శాలిని, సాయి ధరమ్ తేజ్, నికీషా పటేల్, రాకుల్ ప్రీత్ సింగ్, సందీప్ కిషన్, రెజీనా, అల్లు శిరీష్, సంజన, నవదీప్, మాధవి లత, చార్మి, రాగిణి ద్వివేది, పరూల్ యాదవ్, తనీష్‌తో పలువురు స్టార్స్ ఈ పార్టీ‌కి హాజరై సందడి చేసారు.

తారల రాకతో పార్క్ హయత్ హోటల్ సందడిగా మారింది. ముఖ్యంగా స్టార్స్ వివిధ రకాల సెక్సీ డ్రెస్సులతో అందాల విందు చేసారు.

రవితేజ, రాణా, త్రిష

రవితేజ, రాణా, త్రిష

త్వరలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమం షార్జాలో జరుగనున్న నేపథ్యంలో ముందస్తుగా హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ లో పార్టీ జరిగింది. రవితేజ, త్రిష, రాణాతో పాటు పలువురు స్టార్స్ హాజరయ్యారు.

పొట్టిగౌనులో త్రిష

పొట్టిగౌనులో త్రిష


పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి త్రిష ఇలా పొట్టి గౌనులో సెక్సీగా హాజరైంది. రాణాతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో త్రిష గురించి చర్చమొదలైంది. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

బాబా సెహగల్

బాబా సెహగల్


ప్రముఖ సింగర్ బాబా సెహగల్ ఈ మధ్య టాలీవుడ్లో మహా బిజీ అయ్యాడు. పవర్ స్టార్, ఇతర స్టార్ హీరోల సినిమాలకు ఆయన పాటలు బాబా పాపులర్ అయ్యాయి. దీంతో టాలీవుడ్లోనే మకాం వేసారు ఈ సింగర్ బాబా.

సెక్సీ లుక్

సెక్సీ లుక్


పలువురు వర్ధమాన తారలు, కొత్తగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటరైన తారలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఈ కార్యక్రమానికి ఇలా చిట్టిపొట్టి దుస్తువుల్లో సెక్సీలుక్ తో మతి పోగొట్టారు.

హర్షవర్ధన్, జ్వాలా

హర్షవర్ధన్, జ్వాలా


టాలీవుడ్ నటుడు హర్ష వర్ధన్, బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా ఈ మధ్య చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనేది ఇండస్ట్రీ టాక్. సైమా పార్టీలోనూ వీరిద్దరూ జంటగా హాజరు కావడం గమనార్హం.

మురళీ మోహన్

మురళీ మోహన్


ప్రముఖ నటుడు, మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్‌తో పలువురు నిర్మాతలు, దర్శకుడు, సంగీత దర్శకుడులూ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు.

శ్రీయ

శ్రీయ


హీరోయిన్ శ్రీయ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పార్టీ సందర్భంగా ఇలా ప్రత్యేకమైన డ్రెస్సులో ఎంతో అందంగా తయారై అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

మధుశాలిని

మధుశాలిని


హీరోయిన్ మధుశాలిని సైమా పార్టీలో ఇలా పింక్ డ్రెస్సెలో తన సెక్సీ అందాలను ఎక్స్ ఫోజ్ చేస్తూ దర్శనం ఇచ్చింది. టోటల్‌గా ఈ కార్యక్రమంలో అందరి దృష్టి తనపై పడేలా తంటాలు పడింది మధుశాలిని.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్


త్వరలో ‘రేయ్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా సైమా పార్టీలో సందడి చేసారు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న రేయ్ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.

రాగిణి ద్వివేది

రాగిణి ద్వివేది

టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న నటి రాగిణి ద్వివేది సైమా పార్టీలో ఇలా సెక్సీ డ్రెస్సుతో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది.

రాహుల్

రాహుల్

అందాల రాక్షసి చిత్రంతో అందరికీ సుపరిచితం అయిన రాహుల్, ప్రస్తుతం రామానాయుడు ప్రొడక్షన్లో ‘నేనేం చిన్నపల్లనా?' చిత్రం చేస్తున్నాడు. పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన పార్టీలో రాహుల్ పాల్గొన్నాడు.

నికీషా పటేల్

నికీషా పటేల్

పవన్ కళ్యాణ్ ‘పులి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నికీషా పటేల్ ప్రస్తుతం అవకాశాలు లేక సతమతం అవుతోంది. ఇలాంటి కార్యక్రమాలకు కాస్త సెక్సీ లుక్ తో హాజరైతే ఏమైనా అవకాశాలు రాకపోతాయా అన్నట్లు ఉంది ఆమె ప్రవర్తన.

రాకుల్ ప్రీత్ సింగ్

రాకుల్ ప్రీత్ సింగ్

ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న తార రాకుల్ ప్రీత్ సింగ్. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన అమ్ముడు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమపై కన్నేసింది.

సందీప్ కిషన్

సందీప్ కిషన్

యంగ్ హీరో సందీప్ కిషన్, నిర్మాత పుప్పాల రమేష్ సైమా పార్టీలో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇంత క్లోజ్ గా ఉన్నారంటే వీరి కాంబినేషన్లో త్వరలో సినిమా రాబోతుందేమో?

పరూల్ యాదవ్

పరూల్ యాదవ్

తెలుగులో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్లలో పరూల్ యాదవ్ ఒకరు. ఇప్పటికే కన్నడ చిత్రాల్లో నటించిన ఈ అమ్మ ఇప్పుడు తెలుగు మార్కెట్ పై కూడా కన్నేసింది.

రెజీనా

రెజీనా


హీరోయిన్ రెజీనా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. తెలుగులో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న హీరోయిన్లలో రెజీనా ఒకరు.

అల్లు శిరీష్

అల్లు శిరీష్


మెగా ఫ్యామిలీ నుంచి ఇటీవల కొత్తగా వెండి తెరకు పరిచయమైన హీరో అల్లు శిరీష్. తొలి చిత్రం గౌరవం ప్లాప్ అయినా....రెండో చిత్రంతో తన సత్తా నిరూపించుకుంటాను అంటున్నాడు.

బెల్లంకొండ సురేష్

బెల్లంకొండ సురేష్


నిర్మాత బెల్లంకొండ సురేష్ సైమా పార్టీకి హాజరయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో బెల్లంకొండ ఒకరు. త్వరలో బెల్లంకొండ జూ ఎన్టీఆర్‌తో ‘రభస' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

చాముడితో త్రిష

చాముడితో త్రిష


చాముండేశ్వరినాథ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సినీ, క్రికెట్ సెలబ్రిటీలతో టచ్ లో ఉంటూ తనూ కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయాడు.

సుబ్బరాజు

సుబ్బరాజు

సుబ్బరాజు ఇలా భారీ గడ్డం పెంచాడంటే.....రాబోయే ఏదో ఒక సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడన్నమాట. ఏది ఏమైనా సుబ్బరాజు లుక్ అదిరింది.

సంజన

సంజన

తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నా....స్టార్ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేక పోయింది కన్నడ భామ సంజన. సైమా పార్టీ ఆమె కెరీర్‌కు ఏ మేరకు తోడ్పడుతుందో చూడాలి.

మహత్ రాఘవేంద్ర

మహత్ రాఘవేంద్ర


బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన మహత్ రాఘవేంద్ర సైమా పార్టీలో హీరోయిన్లతో కలిసి సందడి చేసారు. హీరోయిన్లతో కలివిడిగా తిరుగుతూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

నవదీప్

నవదీప్


అందం, టాలెంట్ ఉన్నా...అదృష్టం కలిసిరాని హీరో నవదీప్. పాపం పరిశ్రమలో అడుగు పెట్టి చాలా ఏళ్లయినా....ఇప్పటికీ నవదీప్‌కు సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇలా పార్టీల్లో మెరవడం తప్ప సినిమాల్లో మెరవలేకపోతున్నాడు.

మహేశ్వరి

మహేశ్వరి


చాలా కాలం క్రితం వచ్చిన ‘గులాబీ' చిత్రంలో బబ్లీగా నటించి అందరినీ ఆకట్టుకున్న మహేశ్వరి ఆ తర్వాత కొన్ని సినిమాల తర్వాత తెరమరుగైంది. పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. ఇపుడు సైమా పార్టీలో దర్శనం ఇచ్చింది.

మాదవీ లత

మాదవీ లత


హీరోయిన్ మాధవీ లత సైమా పార్టీకి ఇలా మోడ్రన్ డ్రెస్సులో సెక్సీగా హాజరైంది. ప్రస్తుతం మాధవి లత చేతిలో పెద్దగా సినిమాలు లేవు. చదువుపై దృష్టి పెట్టడం వల్లనే సినిమాలు తగ్గించానని కహానీలు చెబుతోంది ఈ అమ్మడు.

యంగ్ హీరోయిన్లు

యంగ్ హీరోయిన్లు


వీరంతా టాలీవుడ్, సౌతిండియా సినీ పరిశ్రమలో తమ అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైమా పార్టీలో ఇలా సెక్సీ లుక్ తో హాజరయ్యారు.

చార్మి

చార్మి


హీరోయిన్ చార్మి కూడా సైమా పార్టీకి హాజరైంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా....ఐటం సాంగులు, గెస్టు పాత్రలతో రాణించే ప్రయత్నం చేస్తోంది. చార్మి ఇటీవల నటించిన ప్రేమ ఒక మైకం చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

టాలీవుడ్ యంగ్ తరంగ్

టాలీవుడ్ యంగ్ తరంగ్


వీరంతా టాలీవుడ్ యంగ్ తరంగ్. అల్లరి నరేష్, నాని, తనీష్ తదితరులతో పాటు ఇతర నటులను కూడా ఈ ఫోటోలో చూడొచ్చు.

English summary
As a kick off to the SIIMA's happening on 12th and 13th September in U.A.E , actor Rana Daggubati co-hosted a pre-party in Hyderabad which saw celebs from the southern film fraternity in attendance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu