twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రచ్చ రంబోలా: హీరోయిన్స్ చిందులు (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : అవార్జుల ఫంక్షన్ లో అవర్డుల పుచ్చుకునేవారి సంగతేమో గానీ... వాటినీ చూసేవారికి మాత్రం మంచి ఉషారుగా ఉంటుంది. అక్కడ హీరోయిన్స్ డాన్స్ లు, హీరోల విన్యాసాలు...అవార్డులు..ఆశ్చర్యాలు..అబ్బో...అలాంటిదే...సైమా అవార్జులు.

    ఇటు తెలుగు హీరోలు, అటు తమిళ తంబీలు, మరోవైపు కన్నడ స్టార్లు, ఇంకోవైపు మలయాళ ధీరులు మొత్తానికి సగం సినిమా ప్రపంచం కళ్లముందే కదలాడింది. దక్షిణాది తారలంతా ఒకేచోట చేరిన మధుర క్షణాలకు సుమధుర సన్నివేశాలకు 'సైమా' వేదికయ్యింది. అట్టహాసంగా ఆరంభమైన 'సైమా' వేడుక కొనసాగింది.

    అసలే మలేసియా భూతల స్వర్గం. ఇప్పుడు ఆ అందానికి మరింత మెరుపొచ్చింది. ఆ సోయగానికి కొత్త సొగసొచ్చింది. ఎందుకంటే మన తారలంతా అక్కడ తళుక్కుమంటున్నారు. ఓ పక్క పురస్కార ప్రతిమలు మరోవైపు తారల చిద్విలాసాలు వెరసి కౌలాలంపూర్‌ మరింత కలర్‌ఫుల్‌గా మారింది.

    స్లైడ్ షో లో...ఆ ఫోటోలు..

    పరస్పర ప్రశంసలు

    పరస్పర ప్రశంసలు

    విందు, వినోదం, చిందులూ, చిద్విలాసాలూ, కళ్లనిండా పురస్కారం పొందిన ఆనందం, పరస్పర ప్రసంశలు కనిపించాయి సైమా వేడుకలో.

    ఆరు పురస్కరాలు

    ఆరు పురస్కరాలు

    బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించిన 'అత్తారింటికి దారేది'సైమాలోనూ జోరు చూపించింది. ఏకంగా ఆరు పురస్కారాలను అందుకొంది.

    ఇవి అవే...

    ఇవి అవే...

    ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయిక (సమంత), ఉత్తమ దర్శకుడు (త్రివిక్రమ్‌), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్‌) పురస్కారాలు 'అత్తారింటి...'కే దక్కాయి.

    మహేష్ తరుపున

    మహేష్ తరుపున

    ఉత్తమ నటుడి ప్రతిమ మరోసారి మహేష్‌బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)చేతిలో చేరిపోయింది. మహేష్‌ తరపున సుధీర్‌బాబు ఈ పురస్కారం అందుకొన్నారు.

     చిరుకి...

    చిరుకి...

    పర్యటక రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగానూ మలేసియా పర్యటక శాఖ, సైమా కలసి చిరును ఘనంగా సత్కరించాయి.

    దర్శకేంద్రుడుకి..

    దర్శకేంద్రుడుకి..

    దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి జీవితకాల సాఫల్య పురస్కారం అందించారు.

    ఎవరెవరు

    ఎవరెవరు

    శింబు, క్రిష్‌, ఖుష్బూ, అమలాపాల్‌, కార్తీక్‌, మంచు లక్ష్మీ ప్రసన్న, రానా, ఛార్మి, రాజ్‌తరుణ్‌ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.

    గాయకులు, నృత్య దర్శకులు

    గాయకులు, నృత్య దర్శకులు

    ఉత్తమ గాయకుడు: శింబు (డైమండ్‌ గర్ల్‌- బాద్‌షా)
    ఉత్తమ గాయని: చిత్ర (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)

    ఉత్తమ నృత్యదర్శకుడు: జాని (నాయక్‌)

    సహాయం

    సహాయం

    ఉత్తమ సహాయనటుడు: సునీల్‌ (తడాఖా)
    ఉత్తమ సహాయనటి: మంచు లక్ష్మి ప్రసన్న (గుండెల్లో గోదారి)

    హాస్యం

    హాస్యం

    ఉత్తమ హాస్యనటుడు: బ్రహ్మానందం (బాద్‌షా). బ్రహ్మానందం స్టేజిపై మాట్లాడి అల్లాడించారు

    ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు:

    ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు:

    కొరటాల శివ (మిర్చి). ప్రభాస్ తో చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగానూ రికార్డు క్రియేట్ చేసింది.

    ఉత్తమం

    ఉత్తమం

    ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడు: రాజ్‌ తరుణ్‌ (ఉయ్యాల జంపాల)
    ఉత్తమ తొలి చిత్ర కథానాయిక: అవికాగోర్‌ (ఉయ్యాల జంపాల)

    'జగదేకవీరుడు అతిలోక సుందరి'

    'జగదేకవీరుడు అతిలోక సుందరి'

    చిరంజీవి, శ్రీదేవి జంటగా నడిచొస్తుంటే, ఆ పక్కనే రాఘవేంద్రుడు తోడుంటే.. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' గుర్తొచ్చింది

    శ్రియ, రెజీనా

    శ్రియ, రెజీనా

    జనాలకు. శ్రియ ఆటపాటల్లో, దేవిశ్రీప్రసాద్‌ హుషారులో, రెజీనా చిందుల్లో నెగారా స్టేడియం తడిసిముద్దయ్యింది.

    English summary
    The two-day South Indian International Movie Awards event (SIIMA 2014) kicked off in a grand note on Friday at Stadium Negara in Kuala Lampur, Malaysia.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X