సైమా 2018: బెస్ట్ యాక్టర్ ప్రభాస్, బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి.... బాలయ్యతో పాటు ఇంకా!
Recommended Video

సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) 2018 వేడుక దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జరుగుతున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తొలి రోజు తెలుగు కేటగిరీకి సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ ఏడాది బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ బాహుబలి 2-ది కంక్లూజన్ దక్కించుకుంది. దీంతో పాటు ప్రభాస్, రాజమౌళి, బాలయ్య తదితరులకు అవార్డులు దక్కాయి.

ఉత్తమ నటుడు ప్రభాస్
ఉత్తతమ చిత్రం: బాహుబలి 2- ది కంక్లూజన్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): గౌతమీపుత్ర శాతకర్ణి
ఉత్తమ దర్శకుడు : ఎస్ఎస్ రాజమౌళి (బాహుబలి 2-ది కంక్లూజన్)
ఉత్తమ నటుడు: ప్రభాస్ (బాహుబలి 2)

క్రిటిక్స్ కేటగిరీలో ఉత్తమ నటుడు బాలయ్య
ఉత్తమ నటుడు (కిటిక్స్): నందమూరి బాలకృష్ణ (గౌతమీపుత్ర శాతకర్ణి)
ఎంటర్టెనర్ ఆఫ్ ది ఇయర్: రానా దగ్గుబాటి (బాహుబలి 2, ది ఘాజీ ఎటాక్, నేనే రాజు నేను మంత్రి)
ఉత్తమ నటి: కాజల్ (నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : రితికా సింగ్ (గురు)

బెస్ట్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి
ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి (నిన్నుకోరి)
ఉత్తమ సహాయ నటి: భూమిక (ఎంసీఏ)
ఉత్తమ సంగీతం: కీరవాణి (బాహుబలి 2)
ఉత్తమ గేయర చయిత: సుద్దాల అశోక్ తేజ(ఫిదా)

బెస్ట్ విలన్ రానా దగ్గుబాటి
ఉత్తమ ప్రతి నాయకుడు: రానా దగ్గుబాటి (బాహుబలి 2)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: సందీప్ వంగ (అర్జున్ రెడ్డి)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్ (బాహుబలి 2)
ఉత్తమ హాస్య నటుడు: రాహుల్ రామకృష్ణ (అర్జున్ రెడ్డి )


Click it and Unblock the Notifications











