SIIMA 2023 Nominations: RRRకు గట్టి పోటీనిస్తున్న సీతారామం.. ఇంకా ఏయే సినిమాలు బరిలో ఉన్నాయంటే?
ప్రతి ఏడాది సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఘనంగా నిర్వహిస్తూ... అవార్డుల ప్రదానోత్సవం కూడా జరిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16వ తేదీలలో ఈ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా 2023 వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో పలు సినిమాలు నామినేట్ అయ్యాయి? ఏ ఏ సినిమాలు నామినేట్ అయ్యాయి? అనే వివరాలు చూసేద్దాం పదండి.
ఆర్ఆర్ఆర్ 11, సితారామం 10: ఇక ఈ ఏడాది సైమా అవార్డులకు గాను ఆర్ఆర్ఆర్ సినిమా అయితే ఏకంగా ఆ 11 కేటగిరీలలో నామినేషన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సీతారామం సినిమాకి 10 కేటగిరీలలో నామినేషన్లు తగ్గాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆర్ఆర్ఆర్ సినిమాకి 11 కేటగిరీలలో నామినేషన్ దక్కడమే కాకుండా ఆస్కార్ అవార్డు కూడా సంపాదించిన ఈ సినిమా ఈ ఏడాది సైమా అవార్డులలో అన్ని అవార్డులను క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఏం జరగబోతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు.

5 బెస్ట్ సినిమాలు: నిజానికి ఈ ఏడాది ఐదు సినిమాలో బెస్ట్ ఫిలిం తెలుగు 2023 కేటగిరీకి గాను నామినేట్ అయ్యాయి. 2022 సంవత్సరంలో విడుదలైన డీజే టిల్లు సినిమా, కార్తికేయ 2 సినిమా, మేజర్ సినిమా, ఆర్ఆర్ఆర్ సినిమా సీతారామన్ సినిమాలు బెస్ట్ తెలుగు 2023 కేటగిరీకి గాను నామినేట్ అయ్యాయి. వీటిలో ఒక్క సినిమాకి బెస్ట్ సినిమా అవార్డు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏ సినిమా ఈ అవార్డును దక్కించుకోబోతోందనే విషయం మీద మాత్రం పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
తమిళలంలో: ఇక తమిళంలో కూడా అత్యధికంగా కొన్ని సల్మాన్ సినిమా 10 నామినేషన్లు దక్కించుకుంది. కొన్ని అంశాలను మొదటి భాగానికి ఈ నామినేషన్లు జరిగాయి. ఆ తర్వాత కమల్ హాసన్, లోకేష్ కనగరాజు కాంబినేషన్లో తెరకెక్కి విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన విక్రమ్ సినిమాకి ఏకంగా తొమ్మిది నామినేషన్లు దక్కాయి. ఇక కన్నడ సినిమాల విషయానికి వస్తే కాంతార సినిమా అలాగే యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ 2 సినిమాకి కూడా దాదాపు 11 కేటగిరీలలో నామినేషన్స్ అయ్యాయి.
మలయాళంలో: అయితే మలయాళంలో మాత్రం మిగతా అన్ని సినీ పరిశ్రమ కంటే భిన్నంగా ఈసారి బెస్ట్ మూవీ క్యాటగిరిలో ఆల్ సినిమాలు పోటీపడుతున్నాయి. మమ్ముట్టి పాత్రలో నటించిన భీష్మ పర్వం సినిమాకి ఏకంగా 8 నామినేషన్లు రాగా తోవినో థామస్ నటించిన తల్లుమాల సినిమాకి 7 నామినేషన్లు వచ్చాయి. ఇక మలయాళంలో హృదయం, జయ జయ జయహే, జనగణమన సహా మరో సినిమా నామినేట్ అయింది.


Click it and Unblock the Notifications











