»   » సైమా-2015 రేసులో మహేష్ బాబు, ఇంకా ఎవరెవరు?

సైమా-2015 రేసులో మహేష్ బాబు, ఇంకా ఎవరెవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల నామినేషన్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ అవార్డులకు సంబంధించి బెస్ట్ యాక్టర్ రేసులో అసలు మహేష్ బాబు పేరు లేక పోవడం పలువురు అభిమానులను ఆశ్చర్య పోయేలా చేసింది. ‘1-నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలాంటిది ఆయన పేరు కనీసం నామినేషన్స్ లిస్టులో లేక పోవడం ఇటీవల చర్చనీయాంశం అయింది.

అయితే తాజాగా విడుదలైన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) 2015 నామినేషన్ల లిస్టులో ఉత్తమ నటుడి కేటగిరీలో మహేష్ బాబు కూడా నిమినేట్ అయ్యారు. వివిధ అంశాలకు సంబంధించిన నామినేషన్స్ లిస్టు విడుదల చేసారు. ‘మనం', ‘రేసు గుర్రం' చిత్రాలు 11 నామినేషన్లతో టాప్ లో ఉన్నాయి.

సినిమా పరిశ్రమకు సంబంధించి సౌత్ ఇండియాలో ఇదే అతి పెద్ద అవార్డుల కార్యక్రమం. జూన్ 18 నుండి ఓటింగ్ మొదలు కానుంది. ఆగస్టు 6, 7 తేదీల్లో దుబాయ్ లో అవార్డుల వేడుక జరుగనుంది. నామినేషన్ల వివరాలు స్లైడ్ షోలో...

నామినేషన్లు..

నామినేషన్లు..

ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం కేటగిరీలకు సంబంధించిన నామినేషన్లు ఇక్కడ చూడొచ్చు.

సైమా 2015

సైమా 2015

ఉత్తమ తెరంగ్రే నిర్మాత, ఉత్తమ నటి, ఉత్తమ తెరంగ్రేట దర్శకుడు కేటగిరీలకు సంబంధించిన వివరాలు.

ముఖ్యమైన

ముఖ్యమైన

ఉత్తమ తెరంగ్రేట నటి, ఉత్తమ కమెడియన్, ఉత్తమ తెరంగ్రేట నటుడు వివరాలకు సంబంధించిన వివరాలు.

టెక్నికల్

టెక్నికల్

ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గేయరచయిత, ఉత్తమ గాయని, ఉత్తమ గాయకుడు నామినేషన్లు

దుబాయ్ లో వేడుక

దుబాయ్ లో వేడుక

అవార్డుల వేడుక ఆగస్టు 6, 7 తేదీల్లో దుబాయ్ లో జరుగనుంది.

ప్రతిష్టాత్మక అవార్డులు

ప్రతిష్టాత్మక అవార్డులు

సౌతిండియా యాక్టర్స్ సైమా అవార్డు అందుకోవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.

English summary
The awards season is bringing in a brand new joy in the film circles. After Film fare awards nominations were announced, now its the turn of South Indian International Movie Awards(SIIMA). The nominations list for the year 2015 of Telugu movies has Manam and Race Gurram topping the charts with highest number of nominations with 11 each.
Please Wait while comments are loading...