సైమా అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా.. రికార్డులు బద్దలు కొట్టిన ‘రంగస్థలం’..

Recommended Video

Siima 2019 Awards Tollywood Winners Full List || Filmibeat Telugu

దక్షిణ భారతదేశంలోని సినీ పరిశ్రమలకు చెందిన సినిమాలు, నటులు, టెక్నీషియన్లలో టాలెంట్‌ను వెలికి తీసి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా). ఈ అవార్డులను ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రదానం చేస్తారు. ఇప్పటికే ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న ఈ అవార్డుల వేడుక.. ఎనిమిది కార్యక్రమాన్ని ఖతర్‌లోని దోహాలో జరుపుకుంటోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు అవార్డులను ప్రకటించారు.

 మహానటికే ఫిదా

మహానటికే ఫిదా

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తీ సురేష్‌కే సైమా అవార్డు దక్కింది. ‘మహానటి'లో కనబరిచిన అత్యుత్తమ నటనకు జ్యూరీ సభ్యులు ఓటేశారు. దీంతో కీర్తి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి చేరింది. అలాగే, ఉత్తమ చిత్రం కూడా ఈ సినిమాకే దక్కింది. దీనితో పాటు ఈ చిత్రంలో నటించిన రాజేంద్ర ప్రసాద్‌కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు లభించింది.

 సత్తా చాటిన రంగస్థలం

సత్తా చాటిన రంగస్థలం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం' సినిమా సైమా అవార్డుల్లో సత్తా చాటింది. మొత్తం 12 విభాగాల్లో నామినేట్ అయిన ఈ సినిమా తొమ్మిది అవార్డులను కైవసం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, ఉత్తమ దర్శకుడి విభాగంలో సుకుమార్, ఉత్తమ సహాయ నటిగా అనసూయ సహా ఎన్నో అవార్డులు వచ్చాయి.

 చిన్న సినిమాగా వచ్చి మూడు అవార్డులు

చిన్న సినిమాగా వచ్చి మూడు అవార్డులు

2018లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం ‘RX100'. అజయ్ భూపతి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో కార్తికేయ - పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించారు. యదార్థ ప్రేమకథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు మూడు అవార్డులు దక్కాయి. ‘రంగస్థలం', ‘మహానటి' తర్వాత ఈ సినిమాకే ఎక్కువ అవార్డులు వచ్చాయి.

 పాంట‌లూన్స్ సైమా అవార్డ్స్ - 2019 విజేతలు వీళ్లే

పాంట‌లూన్స్ సైమా అవార్డ్స్ - 2019 విజేతలు వీళ్లే

ఉత్తమ చిత్రం - మహానటి
ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి)
ఉత్తమ నటుడు - రామ్ చరణ్ (రంగస్థలం)
ఉత్తమ దర్శకుడు - సుకుమార్ (రంగస్థలం)

ఉత్తమ నటి (క్రిటిక్స్) - సమంత (రంగస్థలం)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - విజయ్ దేవరకొండ (గీత గోవిందం)

ఉత్తమ సహాయ నటి - అనసూయ (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు - రాజేంద్రప్రసాద్ (మహానటి)

ఉత్తమ ఆరంగేట్ర నటుడు - కల్యాణ్ దేవ్ (విజేత)
ఉత్తమ ఆరంగేట్ర నటి - పాయల్ రాజ్‌పుత్ (RX100)

సైమా అవార్డ్స్ - 2019

సైమా అవార్డ్స్ - 2019

ఉత్తమ ఆరంగేట్ర దర్శకుడు - అజయ్ భూపతి (RX100)

ఉత్తమ హాస్యనటుడు - సత్య (ఛలో)

ఉత్తమ ప్రతి నాయకుడు - శరత్ కుమార్ (నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా)

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ - దేవిశ్రీప్రసాద్ (రంగస్థలం)

ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్ (ఎంత సక్కగున్నావే - రంగస్థలం)

ఉత్తమ నేపథ్య గాయకుడు - అనురాగ్ కులకర్ణి (పిల్లా రా - RX100)

ఉత్తమ నేపథ్య గాయని - ఎమ్ఎమ్ మానసి (రంగమ్మ మంగమ్మ - రంగస్థలం)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - రామకృష్ణ (రంగస్థలం)

సోషల్ మీడియా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ - విజయ్ దేవరకొండ

స్పెషల్ అప్పీరెన్స్ అవార్డ్ (జ్యూరీ) - సుధీర్ బాబు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X