For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SIIMA Awards 2022: సైమా అవార్డుల విజేతలు వీళ్లే.. బన్నీ సినిమా అరాచకం.. నందమూరి ఫ్యాన్స్‌కు నిరాశే

  |

  సౌత్ ఇండియాలో ఉన్న సినీ పరిశ్రమలకు చెందిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో టాలెంట్‌ను వెలికి తీసి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా). ఈ అవార్డులను ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రదానం చేస్తుంటారు. ఇలా ఇప్పటికే తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్న సైమా.. పదవ కార్యక్రమాన్ని బెంగళూరులో జరుపుకుంటోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు అవార్డులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో ఎవరెవరు ఈ అవార్డులకు ఎంపిక అయ్యారన్న దానిపై పూర్తి వివరాలను చూద్దాం పదండి!

  అంగరంగ వైభవంగా సైమా వేడుక

  అంగరంగ వైభవంగా సైమా వేడుక

  సౌత్ ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే 'సైమా' పదవ అవార్డుల కార్యక్రమం బెంగళూరు నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో దక్షిణాదిలోని పరిశ్రమలకు చెందిన ఎంతో మంది స్టార్లు సందడి చేశారు. మరీ ముఖ్యంగా కొందరు నటీనటులు అదిరిపోయే ప్రదర్శనలు చేశారు. దీంతో ఈ వేడుక ఆద్యంతం అద్భుతమైన సన్నివేశాలతో సాగింది.

  Krishnam Raju: కృష్ణంరాజు రెండు కోరికలు తీర్చని ప్రభాస్.. ఆ పదవి విషయంలోనూ నిరాశే!

   ఒకే సినిమాకు ఆరు సైమా అవార్డ్స్

  ఒకే సినిమాకు ఆరు సైమా అవార్డ్స్

  సైమా 2022 అవార్డుల్లో ఎక్కువ విభాగాల్లో నామినేషన్‌లో ఉన్న 'పుష్ప' సినిమా హవాను చూపించింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ గేయ రచయిత విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి. మొత్తం ఈ సినిమా 12 విభాగాల్లో నామినేట్ అవగా.. ఆరు అవార్డులను దక్కించుకుంది.

  తగ్గేదేలే అంటూ బన్నీ అరాచకం

  తగ్గేదేలే అంటూ బన్నీ అరాచకం

  2022 సైమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా 'పుష్ప' చిత్రంలోని నటనకు గానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యాడు. ఈ ఫంక్షన్ స్టేజ్‌పై అవార్డును అందుకున్న వెంటనే అతడు తగ్గేదేలే అంటూ తనదైన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు, పుష్ప సినిమాలోని పాటలకు కూడా స్టెప్పులేశాడు. దీంతో వేడుక జరిగిన ప్రాంతం అంతా ఒక్కసారిగా ఊగిపోయిందనే చెప్పాలి.

  Krishnam Raju Net Worth: కృష్ణంరాజుకు అన్ని కోట్ల ఆస్తులు.. అప్పట్లోనే అంత రెమ్యూనరేషన్‌తో రికార్డు

  మూడు అవార్డులతో ఉప్పెన హవా

  మూడు అవార్డులతో ఉప్పెన హవా

  దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా.. 2022వ సంవత్సరం జరిగిన పదవ అవార్డుల కార్యక్రమంలో 'ఉప్పెన' చిత్రం కూడా హవాను చూపించింది. ఈ సినిమాకు ఏకంగా మూడు అవార్డులు దక్కాయి. ఉత్తమ డెబ్యూ హీరో‌గా వైష్ణవ్ తేజ్, ఉత్తమ డెబ్యూ హీరోయిన్‌గా కృతి శెట్టి, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా బుచ్చి బాబు సన అవార్డులు దక్కించుకున్నారు.

  నందమూరి ఫ్యాన్స్‌కు నిరాశగానే

  నందమూరి ఫ్యాన్స్‌కు నిరాశగానే

  సైమా అవార్డుల విషయంలో నందమూరి ఫ్యాన్స్ మాత్రం నిరాశగానే ఉన్నారని చెప్పొచ్చు. దీనికి కారణం నటసింహా బాలకృష్ణ నటించిన 'అఖండ' మూవీ ఏకంగా 10 విభాగాల్లో నామినేట్ అయింది. కానీ, ఇందులో మాత్రం కేవలం రెండింటిలోనే అవార్డులను అందుకుంది. పైగా బాలయ్యకు ఉత్తమ నటుడి అవార్డు (క్రిటిక్స్) వస్తుందని అంతా అనుకున్నా.. అలా జరగలేదు.

  Bigg Boss Telugu 6: ఆ అమ్మాయికి బిగ్ బాస్ షాక్.. పిరియడ్స్‌తో ఇబ్బంది.. రిక్వెస్ట్ చేసినా వినకుండా!

  విజయ్ దేవరకొండకు స్పెషల్‌గా

  విజయ్ దేవరకొండకు స్పెషల్‌గా

  అంగరంగ వైభవంగా జరిగిన సైమా 2022 అవార్డుల వేడుకలో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. అతడికి సౌత్ యూత్ ఐకాన్‌గా స్పెషల్ అవార్డును అందించారు. అది తీసుకున్న తర్వాత విజయ్ తనదైన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ వేడుక కోసం తెలుగ రాష్ట్రాల నుంచి ఎంతో మంది సెలెబ్రిటీలు అక్కడకి వెళ్లారు.

  సైమా విజేతలు.. పూర్తి వివరాలివే

  సైమా విజేతలు.. పూర్తి వివరాలివే

  ఉత్తమ చిత్రం: పుష్ప

  ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప)
  ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)
  ఉత్తమ నటి: పూజా హెగ్డే (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్)
  ఉత్తమ సహాయ నటుడు: జగదీష్ ప్రతాప్ బండారి (పుష్ప)
  ఉత్తమ సహాయ నటి: వరలక్ష్మి శరత్‌కుమార్ (క్రాక్)
  ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప)
  ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (శ్రీవల్లి పాట)
  ఉత్తమ గాయకుడు: రామ్ మిరియాల (జాతి రత్నాలు)
  ఉత్తమ గాయని: గీతా మాధురి (అఖండ)
  ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (జాతి రత్నాలు)
  ఉత్తమ నూతన హీరో: పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
  ఉత్తమ నూతన నటి : కృతి శెట్టి (ఉప్పెన)
  ఉత్తమ నూతన దర్శకుడు: బుచ్చి బాబు సన (ఉప్పెన)
  ఉత్తమ నూతన నిర్మాత: సతీష్ వెగేశ్న (నాంది)
  ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సి రామ్ ప్రసాద్ (అఖండ)
  ఉత్తమ హాస్యనటుడు: సుదర్శన్ (ఏక్ మినీ కథ)

  English summary
  The South Indian International Film Awards is one of the most prestigious film awards in the South film industry. Lets See SIIMA Awards 2022 Telugu Complete Winners List.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X