SIIMA 2023: దుబాయ్‌లో సైమా వేడుకలు.. మృణాల్ అందాల ప్రదర్శన.. హోస్ట్ ఎవరంటే?
సినీ రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి అనేక పేర్లతో పురస్కరాలు అందిస్తారన్న విషయం తెలిసిందే. అలా సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన సినిమాలు, నటీనటులు, టెక్నీషియన్లలో టాలెంట్ చూపించినవారికి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డ్స్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA). ఈ పురస్కారాలను ఈ ఏడాది రెండు రోజులు పాటు ఘనంగా నిర్వహించనున్నారు. దుబాయ్ లో జరిగే సైమా 2023 (SIIMA 2023) వేడుకలకు హోస్ట్ గా బాధ్యతలు ఎవరు చేయనున్నారో తెలిసింది. వాళ్లు ఎవరనే విషయంలోకి వెళితే..
కాంప్రమైజ్: దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సైమా అవార్డ్స్ సుమారు 11 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. చివరిగా 2022 సంవత్సరానికి సంబంధించిన వేడుకలను బెంగళూరులో అంత్యత వైభవంగా నిర్వహించారు. దీంతో 2023వ ఏడాదికి సంబంధించిన ఈవెంట్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకను సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిపించనున్నారు. 2023 సైమా వేడుకలను ప్రముఖ ఆటో ముబైల్ కంపెనీ నెక్సా (Nexa) స్పాన్సర్ గా వ్యవహరించనుందని సమాచారం.

సంతోషంగా: సైమా వేడుకలకు సంబంధించిన విషయాలపై తాజాగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ పాల్గొన్నారు. "సౌత్ ఇండియాలో అనేక సినీ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలోని సృజనాత్మకతను గుర్తించేందుకు, ప్రతిభను ప్రోత్సహించేందుకు సైమా, నెక్సా కలిసాయి. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఇక నుంచి ఈ బంధం ఎంతో బలంగా ప్రభావం చూపించాలని ఆశిస్తున్నా" అని బృందా ప్రసాద్ తెలిపారు.
ఒకే తాటిపైకి: అయితే ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీ సీతా రామం బ్యూటి మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. "సైమా సంస్థ దక్షిణాది సినీ పరిశ్రమను ఒకే తాటిపైకి తెచ్చింది. ఈ వేడుకల్లో నేను భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది" అని రానా పేర్కొన్నాడు.

ఆసక్తిగా: "నా తొలి చిత్రం సీతా రామం విడుదలైన వెంటనే సైమాలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. అభిమానుల ప్రేమను నేను స్వీకరించాను. దుబాయ్ లోని DWTCలో జరిగే వేడుకల్లో పర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని మృణాల్ తెలిపింది.
హోస్టింగ్ బాధ్యతలు: ఇదిలా ఉంటే సైమా 2023 వేడుకలకు హోస్ట్ గా రానా దగ్గుబాటి వ్యవహరించనున్నాడని తెలిసింది. అతనితోపాటు హాట్ బ్యూటి మృణాల్ ఠాకూర్ కూడా హోస్టింగ్ బాధ్యతలు తీసుకోనుందని సమాచారం. ఇటీవల రానా వెబ్ సిరీస్ రానా నాయుడుకు మృణాల్ ప్రమోషన్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











