SIIMA Awards 2023: సైమా అవార్డుల విజేతలు వీళ్లే.. బెస్ట్ హీరోగా ఎన్టీఆర్.. ఆ సినిమాకే ఎక్కువగా!
చిత్ర రంగానికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన అవార్డులు ఉన్నాయి. అందులో సౌత్ ఇండియాలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీల చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో టాలెంట్‌ను వెలికి తీసి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి.
ఈ అవార్డులను ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రదానం చేస్తుంటారు. ఇలా ఇప్పటికే పది వసంతాలు పూర్తి చేసుకున్న సైమా.. 11వ కార్యక్రమాన్ని తాజాగా జరుపుకుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో ఎవరెవరు ఈ అవార్డులకు ఎంపిక అయ్యారో చూద్దాం పదండి!

ఎంతో గ్రాండ్‌గా జరిగిన వేడుక: 2023వ ఏడాదికి సంబంధించిన ఈవెంట్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్వహకులు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగానే 15వ తేదీన దుబాయ్‌లో దీన్ని నిర్వహించారు. మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో తెలుగు, కన్నడ భాషలకు సంబంధించిన అవార్డులను అందించారు.

ఒకే సినిమాకు 5 సైమా అవార్డ్స్: సైమా 2023 అవార్డుల్లో ఎక్కువ విభాగాల్లో నామినేషన్‌లో ఉన్న 'RRR' సినిమా హవాను చూపించింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ గేయ రచయిత విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి. దీని తర్వాత ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చిన 'సీతా రామం' మూవీకి మూడు విభాగాల్లో అవార్డులు దక్కాయి.

ఎన్టీఆర్‌కే అవార్డు.. వాళ్లదేనట: 2023 సైమా అవార్డుల్లో 'RRR' చిత్రంలోని నటనకు గానూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ ఫంక్షన్ స్టేజ్‌పై అవార్డును అందుకున్న వెంటనే అతడు తనదైన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు, తనకు వచ్చిన ఈ అవార్డుకు అభిమానులే కారణం అని, వాళ్లందరికీ పాదాభివందనం చేస్తున్నానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

సైమా విజేతలు.. పూర్తి వివరాలివే
ఉత్తమ చిత్రం: సీతారామం
ఉత్తమ దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి (RRR)
ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (RRR)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ విలన్: సుహాస్ (హిట్ 2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ చాయిస్): అడివి శేష్
ఉత్తమ నటి (క్రిటిక్స్ చాయిస్): మృణాల్ ఠాకూర్
ఉత్తమ సహాయ నటుడు: దగ్గుబాటి రానా (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎమ్ఎమ్ కీరవాణి (RRR)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (RRR)
ఉత్తమ గాయకుడు: రామ్ మిరియాల (డీజే టిల్లు)
ఉత్తమ గాయని: మంగ్లీ
ఉత్తమ నూతన హీరో: అశోక్ గల్లా (హీరో)
ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ నూతన దర్శకుడు: వశిష్ట (బింబిసార)
ఉత్తమ నూతన నిర్మాత: శరత్ అండ్ అనురాగ్ (మేజర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (RRR)
ఫ్యాషన్ యూత్ ఐకాన్: శృతి హాసన్
ప్రామిసింగ్ స్టార్: బెల్లంకొండ గణేష్
సెన్సేషనల్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: కార్తికేయ 2


Click it and Unblock the Notifications











