SIIMA Awards 2024: సైమా అవార్డుల్లో నాని రికార్డు.. ఉత్తమ చిత్రం బాలయ్యదే.. ఫుల్ లిస్ట్ చూశారంటే!

మిగిలిన రంగాలతో పోల్చుకుంటే సినిమాల్లోనే ఎక్కువగా అవార్డులు అనేవి ఉంటాయి. ఇందులో ఉత్తమ చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో టాలెంట్‌ను వెలికి తీసి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఒకటి. ఈ అవార్డులను ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రదానం చేస్తుంటారు. ఇలా ఇప్పటికే 11 వసంతాలు పూర్తి చేసుకున్న సైమా.. 12వ కార్యక్రమాన్ని తాజాగా జరుపుకుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో ఎవరికి ఈ అవార్డులు దక్కాయో చూద్దామా!

దుబాయ్‌లో గ్రాండ్‌గా ఈవెంట్
2024వ ఏడాదికి సంబంధించిన ఈవెంట్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్వహకులు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగానే 14వ తేదీన దుబాయ్‌లో దీన్ని నిర్వహించారు. మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో తెలుగు, కన్నడ భాషలకు సంబంధించిన అవార్డులను ప్రదానం చేశారు.

SIIMA Awards 2024 Telugu Complete Winners List Nani Creates New Record

ఆ సినిమాలకే.. నాని రికార్డుతో
సైమా 2024 అవార్డుల్లో చాలా సినిమాలు నామినేషన్స్‌లోకి వచ్చాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే హవాను చూపించాయి. వాటిలో 'హాయ్ నాన్న' సినిమాకు 5 అవార్డులు, 'దసరా'కు 4 అవార్డులు, 'బేబీ' సినిమా 3 అవార్డులు అందుకున్నాయి. అదే సమయంలో నాని నటించిన రెండు సినిమాలకు 9 అవార్డులు వచ్చినట్లైంది. దీంతో అతడు నయా రికార్డును నమోదు చేశాడు.

SIIMA Awards 2024 Telugu Complete Winners List Nani Creates New Record

బాలయ్య మూవీ.. సెన్సేషన్‌గా
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన 2024 సైమా అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' నిలిచింది. దీంతో చాలా రోజుల తర్వాత ఈ సీనియర్ హీరో ఖాతాలోకి ఈ అవార్డు వచ్చినట్లు అయింది. ఇక, ఈ ఏడాదికి గానూ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్‌గా 'యానిమల్' మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ అవార్డు అందుకున్నారు.

SIIMA Awards 2024 Telugu Complete Winners List Nani Creates New Record

సైమా విజేతలు.. పూర్తి వివరాలివే

ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ చాయిస్): ఆనంద్ దేవరకొండ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్ చాయిస్): మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న)
ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
ఉత్తమ సహాయ నటి: బేబీ ఖియారా ఖాన్(హాయ్ నాన్న)
ఉత్తమ హాస్యనటుడు: విష్ణు ఓఐ (మ్యాడ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహబ్(హాయ్ నాన్న, ఖుషి)
ఉత్తమ గేయ రచయిత: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా - బేబీ)
ఉత్తమ గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు - బలగం)
ఉత్తమ నూతన హీరో: సంగీత్ శోభన్(మ్యాడ్)
ఉత్తమ నూతన నటి : వైష్ణవి చైతన్య(బేబీ)
ఉత్తమ నూతన దర్శకుడు: శౌర్యువ్‌(హాయ్‌ నాన్న)
ఉత్తమ నూతన నిర్మాత: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌(హాయ్‌ నాన్న)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: భువన గౌడ(సలార్)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: సందీప్ రెడ్డి వంగా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X