మహేష్ వర్సెస్ పవన్ : ఆన్‌లైన్లో రెచ్చిపోతున్న ఫ్యాన్స్!

By Bojja Kumar

హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెం.1 స్థానం కోసం పోటీ పడుతున్న హీరోలు ఇద్దరే ఇద్దరు మహేష్ బాబు, పవన్ కళ్యాన్. వాళ్లకి ఈ నెంబర్ గేమ్‌పై ఆసక్తి లేక పోయినా....ఫ్యాన్స్ మాత్రం తమ తమ హీరోలను నెం.1 స్థానంలో చూసుకోవాలని ఆశ పడుతున్నారు. ఇందుకోసం తమకు చేతనైనా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరి అభిమాన హీరో వారికి గొప్ప అనేది కాదనలేని సత్యం. త్వరలో సౌత్ ఇండియన్ ఇంటర్ నేషనల్ మూవీ అవార్డు(సైమా)ల ప్రకటన జరుగనున్న నేపథ్యంలో.....మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆన్ లైన్లో రెచ్చిపోతున్నారు. పోటీ పడి తమ తమ హీరోలను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవార్డుల ఎంపికలో కీలకమైన ఆన్ లైన్ ఓటింగులో పాల్గొంటున్నారు.

SIIMA: Mahesh Babu vs Pawan Kalyan

ఈ అవార్డుల జ్యూరీ లిస్టులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఉత్తమ నటుడి కేటగిరిలో పోటీ పడుతున్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రానికిగాను పవన్ కళ్యాణ్, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికిగాను మహేష్ బాబు నామినేట్ అయ్యారు. అవార్డుల ఎంపికలో ఆన్ లైన్ ఓటింగ్ కీలకం.

ఆన్ లైన్ ఓటింగ్ ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే 4,30,000 ఓట్లు ఉత్తమ నటుడి ఎంపిక కోసం రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. వీటిలో అత్యధిక ఓట్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకే పడ్డాయి. ఇద్దరి మధ్యే ప్రధానమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) కార్యక్రమం ఈ ఏడాది మలేషియాలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈఅవార్డుల కార్యక్రమం జరుగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X