ఇరగ దీస్తున్న సూర్య- సమంత (ఫోటోలు)
హైదరాబాద్: సూర్య హీరోగా నటిస్తున్న సినిమా 'అంజాన్' తెలుగులో 'సికిందర్'గా రాబోతున్న సంగతి తెలిసిందే. సూర్యకు జోడీగా సమంత నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన చిత్రం పోస్టర్, ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ఇద్దరూ అదరగొట్టారని స్పష్టమవుతోంది. ఈ సినిమా సూర్య కెరీర్ లో నిలిచిపోయేదిగా ఉంటుందని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న లింగుస్వామి అంటున్నారు.
ఈ సినిమాని తమిళంలో తిరుపతి బ్రదర్స్ , తెలుగులో లగడపాటి శ్రీధర్ లు నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 75 కోట్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. యువన శంకర్ రాజా ఈచిత్రానికి సంగీతం అందించారు. జులై 31న తెలుగు వెర్షన్ సికిందర్ ఆడియో విడుదలయ్యే అవకాశం ఉంది.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

అంచనాలు భారీగానే...
ఇప్పటికే ఈ సినిమాపై ప్రజల్లో భారీగా అంచనాలు పెరిగాయి. ఈ మధ్య ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

సికిందర్
తెలుగులో బ్రహ్మానందం, మనోజ్ బాజపై, విద్యుత్ జమ్వాల్ మొదలగు వారు నటిస్తున్నారు.

తెలుగులో మంచి మార్కెట్
తమిళంలోలాగానే తెలుగులో కూడా సూర్యకి మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతుంటాయి.

విడుదల తేదీ
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఆగస్టు 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో సూర్య డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.

సూర్య తర్వాతి సినిమా
నెక్ట్స్ ‘మనం' ఫేం విక్రమ్ కుమార్ గౌడ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు సూర్య వెల్లడించారు. ఇప్పటికే తమిళ దర్శకుడు హరితో ‘సింగం', ‘సింగం-2' చిత్రాలు చేసిన సూర్య అతనితో మరో ప్రాజెక్టు చేయబోతున్నట్లు తెలిపారు. 2015లో హరితో సినిమా ఉంటుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











