మళ్లీ సిల్క్ స్మిత సినిమా!
దక్షిణాది సెక్సీ సెరైన్ సిల్క్ స్మిత చనిపోయిన చాలా ఏళ్లే అయింది. ఇపుడు మళ్లీ ఆమెను గుర్తుచేసుకునే ప్రయత్నాన్ని తమిళ సినిమా పరిశ్రమ చేస్తోంది. ఆమె చివరగా వెండితెరపై కనిపించిన సినిమా తంగతామరాయి. ఈ సినిమాలోనే నటిస్తూ సిల్క్ స్మిత ఆత్మహత్యకు పాల్పడింది. దురదృష్టవశాత్తు ఆ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇపుడు ఆ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె చనిపోయిన దశాబ్దం తరువాత ఆమె నటించిన సినిమా విడుదల అవడం నిజంగా విశేషమే. ఆమె బ్రతికి ఉంటే ఇపుడు ఎలా ఉండేదో తెలియదు కానీ తంగతామరాయి సినిమాలో మాత్రం మనం దశాబ్దం క్రితం సిల్క్ స్మితను చూడబోతున్నామన్నమాట.


Click it and Unblock the Notifications











