‘డర్టీ పిక్చర్’కు సిల్మ్‌స్మిత సోదరుడి బ్రేక్!
దక్షిణాది తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ పిక్చర్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్రను పోషించింది. అయితే డర్టీ పిక్చర్ సినిమాను ఆపి వేయాలని సిల్క్ స్మిత సోదరుడు నాగరాజు మంగళవారం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సినిమా నిర్మాతలు ఏక్తాకపూర్ తో పాటు శేఖర్ కపూర్ లను తన పిటీషన్ లో ప్రతివాదులుగా చేర్చాడు.
తన సోదరి సిల్క్ స్మితను సినిమాలో అసభ్యకరంగా చూపించారని నాగారాజు ఆరోపిస్తున్నారు. సినిమాకు సంబంధించినవారికి నోటీసులు ఇచ్చామని, ఎవరూ తమకు సమాధానం ఇవ్వలేదని, అందుకే కోర్టును ఆశ్రయించానని అతను చెప్పుకొచ్చారు.
తాను కొన్ని ట్రయలర్స్ చూశానని, పోస్టర్లు చూశానని, వాటిని చూసినప్పుడు అసభ్యకరంగా కనిపించాయని అతను అన్నాడు. తన సోదరి సిల్క్ స్మితను అనుకరిస్తూ అసభ్యంగా దృశ్యాలను చిత్రీకరించారని అతను ఆరోపించాడు. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలున్నాయని, అవాస్తవాలూ వక్రీకరణలూ ఉన్నాయని అతను అన్నాడు. సినిమాకు సంబంధించినవారు తమను సంప్రదించలేదని, ఏకపక్షంగా సినిమాను నిర్మించారని మండి పడ్డారు.


Click it and Unblock the Notifications











