నిర్మాతను నిద్రపట్టనివ్వకుండా చేస్తున్న సిల్మ్ స్మిత

By Srikanya

అదేమిటి చనిపోయిన సిల్మ్ స్మిత విచిత్రంగా నిర్మాతను నిద్రపట్టనివ్వకుండా చేయటమేంటి అని ఆలోచిస్తున్నారు. దానికి ఓ రీజన్ ఉంది. తాజాగా సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఏక్తా కపూర్ ఓ చిత్రం నిర్మిస్తోందనే సంగతి తెలిసిందే. అయితే ఏక్తా కపూర్ రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఆ చిత్రం కథ గురించి చెబుతూ..తాము ఈ సినిమాలో సిల్క్ స్మిత గ్లామర్ ని చూపబోవటం లేదని, కానీ ఖచ్చితంగా సిల్మ్ స్మితకీ ఓ నిర్మాతకీ ఉన్న సంభంధాన్ని చూపబోతున్నామని చెప్పింది. అలాగే ఆ తర్వాత ఆ నిర్మాతని ఆమె రిజెక్టు చేసిందిని, అయితే అతనే ఆమె ఆత్మ హత్యకు పరోక్షంగా కారకుడయ్యాడని దాన్ని చూపబోతున్నామని చెప్పింది. అయితే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం ఆమె పేరు వెళ్ళడించలేదు.

ఆ తమిళ నిర్మాతకు రాత్రిళ్ళు కునుకులేదని, తనను రోడ్డుమీద పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తన సన్నిహితుల దగ్గర చెప్పుతున్నాడని తమిళ సినీ వర్గాల్లో చెప్తున్నారు. అలాగే సినిమాలో అదే గనుక నిజంగా జరిగితే ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మిలన్ లూద్రియా డైరక్ట్ చేస్తున్నారు. ఏక్తా ఇటీవలే మిలన్ లూద్రియా దర్శకత్వంలో ఒన్స్ అపాన్ ఎ టైమ్ అనే హిందీ చిత్రాన్ని నిర్మించారు. ఇక సిల్క్ స్మితగా యాక్ట్ చేయడానికి విద్యాబాలన్ కూడా ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. ఆ నిర్మాత పాత్రను అజయ్ దేవగన్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X