తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలు పేరు చెప్పి పాపులర్ అయిన పదం 'సిల్లీ ఫెలో' . అప్పుడు జరిగిన గొడవలో మోహన్ బాబు సిల్లీ ఫెలో అని కె.యస్. రామారావు ని అన్నారు. సిల్లీ ఫెలో అంటే యేమీ తెలియని వాడని అర్ధం. ఇప్పుడది కె.యస్.రామారావు చిత్రమైన 'బుజ్జిగాడు' చిత్రంలో మళ్ళీ వినిపించబోతోందిట. అదీ మోహన్ బాబు నోటి నుండి. ఆ సినిమాలో అది ఆయన ఊతపదంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుజ్జిగాడు ప్రివ్యూ చూసి వచ్చి మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమాను, ప్రొడ్యూసర్ ని చాలా బాగా మెచ్చుకోవటం అక్కడున్నవారిని విస్మయ పరిచింది. ఈ సినిమాలో ఆయన హీరోయిన్ కి అన్నగా కనిపించబోతున్నారు.రేపు సినిమా ఉదయం ఆటతో రిలీజు కాబోతోంది.