twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను క్షమించండి, ఆ తప్పు తెలిసిచేయలేదు: ఫ్యాన్స్‌కి బహిరంగ క్షమాపణలు చెప్పిన హీరో

    |

    Recommended Video

    ఫ్యాన్స్‌కి బహిరంగ క్షమాపణలు చెప్పిన హీరో..!

    కోలీవుడ్ బ్యాడ్ బాయ్ శింబు మీద ఇటీవల ఓ నిర్మాత తీవ్ర ఆరోపణలు చేయడం.. అతడిపై తమిళ నిర్మాతల మండలి సస్పెన్షన్ విధించబోతున్నట్లు.. అతడిని మణిరత్నం కొత్త సినిమా నుంచి కూడా తప్పించబోతున్నట్లు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దాని గురించి నిన్ననే ఓపెన్ అయ్యాడు శింబు.

     మైఖేల్‌రాయప్ప

    మైఖేల్‌రాయప్ప

    నటుడు శింబు నటించిన ‘అన్బానవన్‌ అడంగాదవన్‌ అసరాదవన్‌ (ఏఏఏ)' చిత్రాన్ని మైఖేల్‌రాయప్ప నిర్మించిన రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రూపొందించే సమయంలో శింబు సహకరించకపోగా, కథలో పలు మార్పులు సూచించడంతో సినిమా షూటింగ్‌లో జాప్యం చోటుచేసుకోవడంలో సినిమా విడుదల ఆలస్యమై రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాతల సంఘానికి మైఖేల్‌రాయప్ప ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

    అభిమానులు మన్నించాలి

    అభిమానులు మన్నించాలి

    ‘సక్క పోడు రాజా' అనే సినిమాకు సంబంధించిన వేడుక ఆరంభం కాబోతుండగా.. శింబు మీడియాతో మాట్లాడుతూ కొద్దిగా ఈ విషయమై ఓపెనయ్యాడు. ఆ తర్వాత ఈ వేడుకలో కొంచెం లెంగ్తీగానే మాట్లాడాడతను. ఈ గొడవకు సంబంధించి తన తప్పు కూడా ఉందని.. ఇప్పటిదాకా తాను చేసిన తప్పులన్నింటినీ అభిమానులు మన్నించాలని అతనన్నాడు.

     సక్కపోడుపోడురాజా

    సక్కపోడుపోడురాజా

    ఈ క్రమంలో నటుడు సంతానం నటించిన ‘సక్కపోడుపోడురాజా' అనే చిత్రానికి శింబు సంగీత దర్శకుడిగా అవతారమెత్తాడు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శింబు బహిరంగ క్షమాపణలు కోరాడు. కార్యక్రమంలో శింబు మాట్లాడుతూ కాస్త ఉద్వేగానికి లోనైన శింబు అదే ఆవేశం లో మాట్లాడాడు.

     ఆవేదన కలిగింది

    ఆవేదన కలిగింది

    తనకు మోసం చేయడం తెలియదని, అయితే, తనలో ఉన్న తప్పును పలువురి గుర్తించి చెప్పడంతో, తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరుతున్నాననీ అన్నాడు. ‘ఏఏఏ' చిత్రం పరాజయం కావడం తనకు కూడా ఆవేదన కలిగిందని, అభిమానుల కోసమే ఈ చిత్రంలో నటించానని తెలిపారు. కథలో కీలక సన్నివేశాలకు తాను సూచనలివ్వడంతో ఖర్చు పెరగడంతోనే నిర్మాతతో విభేదాలు తలెత్తాయన్నారు.

     బహిరంగ క్షమాపణలు

    బహిరంగ క్షమాపణలు

    షూటింగ్‌ సమయంలోనైనా లేదా చిత్రం విడుదల అయిన తర్వాతైనా తన తప్పును తెలియజేసి ఉంటే సరిదిద్దుకోనేవాడనిని, అయితే, ఆరు నెలల తర్వాత మరో వ్యక్తి ద్వారా ఈ విషయం తెలియడం ఆగ్రహం తెప్పించిందన్నారు. అయినప్పటికీ, తన తప్పుపై బహిరంగ క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపారు.

     అభిమానులకు మాత్రమే జవాబుదారీ

    అభిమానులకు మాత్రమే జవాబుదారీ

    తానెలా ఉండాలన్న విషయం ప్రస్తుతం గ్రహించానని, ఇకపై పొరపాట్లు జరుగకుండా చూసుకుంటానని శింబు చెప్పాడు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ.. మణిరత్నం గురించి అతను చేసిన వ్యాఖ్యలే తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాను అభిమానులకు మాత్రమే జవాబుదారీ అని చెప్పాడు.

    మణిరత్నం

    మణిరత్నం

    సినిమాలు మానేసినా.. అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రం మానను అన్న శింబు.. అందరూ తనను మణిరత్నం సినిమా నుంచి తప్పించినట్లు మాట్లాడుకుంటున్నారని.. కానీ ఈ గొడవ తర్వాత కూడా మణిరత్నం తనతో సినిమా చేయడానికే సిద్ధంగా ఉన్నాడని.. బహుశా మణిరత్నం కూడా తన ఫ్యాన్ అయి ఉండొచ్చేమో అని అన్నాడు.

    English summary
    Simbhu asks Sorry to his Fans for his Mistakes, and answers on "Rayappan addressed reporters at a press meeting in Chennai, where he detailed how Simbu's behaviour had allegedly derailed AAA."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X