నాలో నేను... నాతో నేను!
బిపాషా బసు... ఆ మధ్య 'రాజ్-3'తో ప్రేక్షకులను భయపెట్టింది. అలాగని ఆమెకి భయం లేదా అంటే... ఉందనే చెబుతోంది. చాలా అంశాలు ఆమెని భయపెడుతుంటాయట. అవేంటంటే...
అభద్రత: చేసిన పని అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోయినా... ఏదైనా విషయంలో నా ఆలోచన తప్పు అని తెలిసినా... లేదా, ఎవరినైనా తప్పుగా అర్థం చేసుకున్నానని అనుకున్నా... అభద్రతకి లోనౌతుంటాను. రేపట్నుంచీ నన్ను ఎవ్వరూ గుర్తించరేమో పట్టించుకోరేమో అభిమానించరేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ భావన ఒక్కోసారి మూడునాలుగు రోజులు వెంటాడుతూనే ఉంటుంది.
ఒత్తిడి: పని ఒత్తిడి ఎప్పుడూ నన్ను భయపెట్టదు. కానీ, నా గురించి పూర్తిగా తెలియనివాళ్లు నాపై కామెంట్లు చేస్తుంటే చాలా ఒత్తిడికి గురైపోతుంటాను. నా వ్యక్తిగత జీవితాన్ని టైమ్‌పాస్ సబ్జెక్టుగా మార్చేసేవాళ్లు అప్పుడప్పుడూ ఎదురవుతుంటారు. అలాంటప్పుడు వాళ్లని కడిగిపారేద్దాం అనిపిస్తుంది... ఆ క్షణమే వద్దులే వదిలేద్దాం అనిపిస్తుంది. ఈ రకమైన ఒత్తిడి నన్ను భయపెడుతుంటుంది.

సమయం: టైమ్ రోజూ భయపెడుతూనే ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్నట్టు ఏ పనులు పూర్తికాకపోయినా గడియారం నన్ను తిడుతున్నట్టు భావిస్తాను. ఉదయాన కాస్త ఆలస్యంగా నిద్రలేచినా... జిమ్‌కి వెళ్లడం బద్ధకించినా గడియారం నావైపు కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది.
స్నేహితులు: స్నేహితులంటే భయాన్ని పోగొట్టేవారు. కానీ, కొందరుంటారు... భయపెట్టేవారు. మనముందు ఒకలా పక్కకెళ్లాక మరోలా మాట్లాడేవారంటే నాకు చాలా భయం. మొదట్లో ఇలాంటివారు చాలామందే ఉండేవారు. ఇప్పుడిప్పుడే అలాంటివాళ్లకు దూరంగా ఉండటం నేర్చుకుంటున్నాను.
వయసు: నన్నేకాదు, చాలామందిని భయపెట్టేది ఇదే. ఏదో సాధించాలనుకుంటాం. కానీ, రోజులు అలాఅలా గడిచిపోతుంటాయి. పెరుగుతున్న వయసు ఒక్కోసారి మన లక్ష్యాలని మార్చేస్తుంది. అలా మారిపోతానేమో అని భయపడుతుంటాను. అందుకే వ్యాయామాలని వదులుకోలేను.

Click it and Unblock the Notifications