»   » హన్సికకు ఓ రేంజిలో షాకిచ్చిన శింబు

హన్సికకు ఓ రేంజిలో షాకిచ్చిన శింబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Simbu announces break-up with Hansika
  హైదరాబాద్ : తమిళ నటుడు శింబు... హీరోయిన్ హన్సిక మధ్య సాగుతున్న ప్రేమాయణానికి పుల్‌స్టాప్‌ పడింది. ఆమెతో బంధం ముగిసిన కథ అని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు శింబు. ఈ జంట గతంలో 'మేం ప్రేమలో ఉన్నామ'ని ప్రకటించింది. దీంతో త్వరలోనే వీరి పెళ్లి జరగొచ్చని ప్రచారం సాగింది. అయితే ఆ బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. ఇద్దరి మధ్య ఇటీవల విభేదాలు ఏర్పడ్డాయట. దీంతో గుడ్‌బై చెప్పుకొన్నారని తమిళ పరిశ్రమలో ప్రచారం సాగింది. అయితే ఇటు శింబు కానీ, అటు హన్సిక కానీ ఆ విషయాన్ని ధ్రువీకరించలేదు. తాజాగా శింబునే ముందుకొచ్చి హన్సికతో విడిపోయిన మాట వాస్తవమే అని ప్రకటించారు.

  శింబు ట్వీట్ చేస్తూ... ''ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నా. హన్సికతో బంధం ముగిసిన కథ. ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. నా అభిమానులకు, స్నేహితులకు స్పష్టత ఇచ్చేందుకే ప్రేమ విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తున్నా. ఇకపై నా కెరీర్‌పైనే దృష్టిపెట్టదలచుకొన్నా. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది'' అని ట్వీట్‌ చేశాడు శింబు.

  శింబు ప్రస్తుతం నయనతారతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. నయనతారతోనూ ఇదివరకు ప్రేమాయణం సాగించాడు శింబు. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడిపోయారు. ఇప్పుడు మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఆ విషయమే శింబు, హన్సికల మధ్య విభేదాలకు కారణమని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.


  కొద్ది రోజుల క్రితమే శింబు మీడియాతో మాట్లాడుతూ...నయనతార, నేను కలిపి పనిచేయడం ఇష్టంలేని కొందరే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. మీకు చాలా స్పష్టంగా చెప్పాలంటే హన్సిక నా ప్రియురాలు. నయనతార స్నేహితురాలు అంటూ చెప్పుకొచ్చారు తమిళ హీరో శింబు. నయనతార తో కలిసి నటించటం హన్సికకు ఇష్టం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో శింబు ఖండిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. మా ప్రేమ వ్యవహారంలో నయనతారకు ఎలాంటి పాత్రా లేదు. హన్సిక మరో హీరోతో కలిసి నటించకూడదని నేననుకుంటే భావ్యమా..? అలాగే నయనతారతో నేను కలిసి నటించినా హన్సిక పట్టించుకోదు. అది మా వృత్తి మాత్రమే అన్నారు.

  ఇక పెళ్లి చేసుకోబోయేది హన్సికనే కదా.. అంటే ఏదీ మన చేతిలో లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం మేమిద్దరం ఇష్టపడుతున్నాం. అంతే. హన్సికతో 'వేట్టెమన్నన్‌'లో తొలిసారి కలిసి నటించాను. అప్పుడు కేవలం సినిమాకు సంబంధించిన విషయాలే మాట్లాడా. ఆమె ఫోన్‌నెంబర్‌ కూడా నా వద్ద లేదు. ఓ రోజు అనుకోకుండా మా మధ్య మాటలు కలిశాయి. అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఈ ప్రయాణం ఎక్కడి వరకన్నది మాకూ తెలీదు అన్నారు.

  హన్సికతో కొన్ని కారణాల వల్ల ప్రేమకు బ్రేకులు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయనే వార్తపై స్పందిస్తూ... నేనెప్పుడూ బంధాలను దాచిపెట్టలేదు. వాటి ద్వారా వచ్చే సమస్యలనూ రహస్యంగా ఉంచలేదు. అందరూ అంటున్నట్లు మా ప్రేమ వ్యవహారం హన్సిక అమ్మకు నచ్చకపోతే.. మేమిద్దరం ఎలా కలుసుకోగలుగుతాం? అన్నారు.

  పెళ్లి గురించి మాట్లాడుతూ... ఎందుకో తెలీదు... పెళ్లంటేనే నాకు కొంచెం విరక్తి కూడా. నా దృష్టిలో పెళ్లి చేసుకోవటమంటే జైలుకెళ్లటంలాంటిదే. ప్రేమ కూడా అంతే. వివాహంతో పోలిస్తే ఇది కాస్త నయం. ప్రేమ జైలులో మన తలుపు తాళం చెవి మన వద్దే ఉంటుంది. అనుకున్నప్పుడు బయటపడొచ్చు. అదే పెళ్లే విషయంలో అలా కుదరుదు. మరెవరో మనల్ని జైలులో బంధించి.. తాళం చెవిని కూడా వారి వద్దే ఉంచుకుంటారు. ఏమైనా నా పెళ్లి 19వ ఏటనే కావాల్సింది. ఇప్పటి వరకు వాయిదాపడుతూ వస్తోందంటే నాకు తగిన అమ్మాయే భార్యగా రావాలని రాసిపెట్టి ఉందేమో అన్నారు.

  English summary
  Simbu tweeted, “"I had gone through enough in this relationship, and after much thought invested into this, I hereby declare that I am single now, and I have nothing to do whatsoever with Hansika, and it is all the story of the past. I don't regret the past nor am I in a mood to discuss over the facts which had forced me to this decision.This announcement is also made only to give clarity to my friends, associates and my fans over my status. As of now, I am concentrating on my career and needless to say I am happy and relieved too"
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more