త్రిషతో శింబు లవ్ ఎఫైర్..అది అసలు ప్రేమే కాదు, అప్పుడే అనుకున్నా!

తమిళ నటుడు శింబు లవ్ ఎఫైర్ చిట్టా చాలా పెద్దది. హీరోయిన్లతో శింబు నడిపిన ప్రేమ వ్యవహారాల గురించి పుంఖాలు పుంఖాలుగా కథలు ఉన్నాయి. శింబు ప్రేమ వ్యవహారాలు అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. శింబు ప్రేమ వ్యవహారాలు ఏవి కూడా సుఖాంతం కాలేదు. శింబు కొంత గ్యాప్ తరువాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. శింబు కెరీర్ ఆరంభంలో త్రిషతో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా శింబు ఆ వార్తల గురించి ఓ ఇంటర్వ్యూ లో స్పందించాడు.

Recommended Video

త్రిష, శింబుపై ప్రముఖ నిర్మాత ఫైర్
గ్యాప్ తరువాత మణిరత్నంతో

గ్యాప్ తరువాత మణిరత్నంతో

శింబు చివరగా నటించిన చిత్రం అన్భానవతన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌. ఈ చిత్రం తరువాత శింబుకు కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తరువాత శింబు ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు.

రియల్ లైఫ్ లవర్ బాయ్

రియల్ లైఫ్ లవర్ బాయ్

శింబు వెండి తెరపైనే కాదు రియల్ లైఫ్ లో కూడా లవర్ బాయే. ఈ హారో జాబితాలో అన్ని ప్రేమ కథలు ఉన్నాయి మరి.

 త్రిషతో రెండు సినిమాలు

త్రిషతో రెండు సినిమాలు

శింబు, త్రిష కలసి రెండు చిత్రాల్లో నటించారు. విన్నైతాండి వరువాయా చిత్రంలో త్రిష,శింబు కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది కూడా. 2010 లో వచ్చిన ఈ చిత్రం తెలుగులో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందింది.

ఎఫైర్ మొదలైంది అప్పుడే

ఎఫైర్ మొదలైంది అప్పుడే

ఈ చిత్రంతోనే శింబు, త్రిష మధ్య ఎఫైర్ మొదలైందని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ఎప్పుడూ శింబు ఈ వార్తల గురించి స్పందించలేదు.

 సీక్వెల్ మొదలవుతోంది

సీక్వెల్ మొదలవుతోంది

విన్నైతండి వరువాయా చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నాలు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మొదలు పెట్టాడు. సీక్వెల్ కోసం మాధవన్ ని హీరోగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై శింబు మాట్లాడుతుండగా త్రిష గురించి ప్రశ్న ఎదురైంది.

నటి అవుతుందని అప్పుడే అనుకున్నా

నటి అవుతుందని అప్పుడే అనుకున్నా

ఆ ఇంటర్వ్యూ లో శింబు త్రిష గురించి మాట్లాడుతూ ఆమె నాకు చిన్న తనం నుంచే తెలుసని తెలిపాడు.ఆ వయసులోనే త్రిష మంచి నటి అవుతుందని భావించానని అన్నాడు.

 అది ప్రేమే కాదు

అది ప్రేమే కాదు

త్రిషతో లవ్ ఎఫైర్ గురించి మాట్లాడుతూ అది ప్రేమే కాదని శింబు కొట్టిపారేయడం విశేషం. కనీసం స్నేహం కూడా కాదు. కానీ మా ఇద్దరి మధ్య అభిమానం, ఆదరణ ఉన్నాయని అందువలన చూసే వారు ప్రేమ అని భ్రమపడి ఉంటారని శింబు క్లారిటీ ఇవ్వడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X