twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్న పాటలు రాసాడు, తమ్ముడు సంగీతం ఇచ్చాడు: సరసుడు తెలుగులో వస్తున్నాడు

    శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సరసుడు’. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ కథానాయికలు. పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. టి.రాజేందర్‌ నిర్మాత. సెప్టెంబరు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

    |

    శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'సరసుడు'. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ కథానాయికలు. పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. టి.రాజేందర్‌ నిర్మాత. సెప్టెంబరు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో 'ఇదు నమ్మ ఆళు' పేరుతో రిలీజై 27 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి శింబు కెరీర్‌లోనే నెంబర్‌వన్‌ హిట్‌గా నిలిచింది.

    శింబు, నయనతార

    శింబు, నయనతార

    శింబు సినీ ఆర్ట్స్‌లో ‘కుర్రాడొచ్చాడు' తర్వాత తెలుగులో రిలీజవుతున్న ఈ చిత్రంపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. శింబు, నయనతార ప్రేమించుకొని బ్రేక్‌అప్‌ అయిన చాలాకాలం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరికీ కథ బాగా నచ్చి చేసిన చిత్రం ఇది. వాళ్లిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ అన్నీ చాలా రియలిస్టిక్‌గా వుంటాయి.

    ఆడియో సూపర్‌హిట్‌

    ఆడియో సూపర్‌హిట్‌

    యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే విధంగా ఈ చిత్రం వుంటుంది. శింబు సోదరుడు టి.ఆర్‌. కురళరసన్‌ అందించిన ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులో సెప్టెంబర్‌ 8న అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది.

    Recommended Video

    Breakup : Who's Next Followed By Vignesh Shivan, Simbu, Prabhudeva - Filmibeat Telugu
    మంచి ప్రేమకథతో

    మంచి ప్రేమకథతో

    ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ ‘‘తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కిన చిత్రమిది. తమిళంలో ఇప్పటికే విడుదలై విజయాన్ని సొంతం చేసుకొంది. ‘మన్మథ', ‘వల్లభ' చిత్రాల తర్వాత ఆ స్థాయిలో నాకు పేరు తెచ్చే చిత్రమవుతుంది. ఒక మంచి ప్రేమకథతో పాండిరాజ్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. నా తమ్ముడు కురళ్‌ అరసన్‌ అందించిన సంగీతం, సత్యం రాజేష్‌ నటన చిత్రానికి బలం'' అన్నారు.

    ‘సాఫ్ట్‌వేర్‌ ప్రేమకథ

    ‘సాఫ్ట్‌వేర్‌ ప్రేమకథ

    శింబు తండ్రి టీ. రాజేందర్ ‘‘సాఫ్ట్‌వేర్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. శింబు సినీ ఆర్ట్స్‌ బేనర్‌లో ‘కుర్రాడొచ్చాడు' చిత్రంతో శింబుని హీరోగా లాంచ్‌ చేశాం. మళ్ళీ అదే బేనర్‌లో ‘సరసుడు' చిత్రాన్ని తెలుగులో నిర్మించాం. తెలుగు, తమిళ్‌ బైలాంగ్వేజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించాం. తమిళంలో రిలీజై ఈ చిత్రం 27 కోట్లకి పైగా కలెక్ట్‌ చేసింది. డీమానిటైజేషన్‌ కారణంగా తెలుగు రిలీజ్‌ లేట్‌ అయ్యింది.

    సెప్టెంబర్‌ 8న

    సెప్టెంబర్‌ 8న

    ఇప్పుడు మంచి డేట్‌ చూసుకుని మా చిత్రాన్ని సెప్టెంబర్‌ 8న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసేవిధంగా వుంటుంది. ఈ చిత్రానికి మాటలు, పాటలు నేనే రాశాను. మా చిన్నబ్బాయి కురళ్‌ అరసన్‌ మ్యూజిక్‌ చేశాడు.

    క్రెడిట్‌ అంతా శింబుకే

    క్రెడిట్‌ అంతా శింబుకే

    నన్ను, శింబుని ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయి కురళ్‌ అరసన్‌ని సంగీత దర్శకుడిగా ఆదరించాలని కోరుకుంటున్నాను. శింబుని హీరోగా నేను ఇంట్రడ్యూస్‌ చేస్తే మా కురళ్‌ని ‘సరసుడు' చిత్రంతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా శింబు ఇంట్రడ్యూస్‌ చేశారు. ఆ క్రెడిట్‌ అంతా శింబుకే దక్కుతుంది. ఈ చిత్రంలోని ఒక్కొక్క సాంగ్‌ వెరైటీగా వుంటుంది.

    శింబు మెలోడీ సాంగ్‌

    శింబు మెలోడీ సాంగ్‌

    ఈ చిత్రంలో శింబు మెలోడీ సాంగ్‌ పాడారు. నేను కూడా ఒక మాస్‌ పాటని పాడాను. ఈ పాట మాస్‌ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించే విధంగా వుంటుంది. శింబు సినీ ఆర్ట్స్‌లో ‘కుర్రాడొచ్చాడు' సినిమా తర్వాత డైరెక్ట్‌గా రిలీజ అవుతున్న తెలుగు సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్‌ 8న గ్రాండ్‌గా రిలీజవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి చాలా పెద్ద హిట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను" అన్నారు. నేనే మాటలు, పాటలు రాశా'' అన్నారు.

    English summary
    'Sarasudu' is a Telugu dubbed version of Tamil hit movie 'Idhu Namma Aalu'. Simbu is all set to entertain the Telugu audiences with ‘Sarasudu’ on Sept 8.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X