twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    90కిలోల బరువుతో శింబూ షాకింగ్ సాహసం., ... ఇంత రిస్క్ అవసరమా..??

    |

    అసలు విశయం కంటే కొసరు విషయాల్లోనే ఎక్కువ పాపులర్ అవుతాడు. అదే పద్దతిలో వెళ్ళిన మనోడు ఎక్కువగా వివాదాల్లోనే ఉండటంతో ఈ అనవసర వివాదాల కారణంగా అతడి కెరీర్ బాగా దెబ్బ తింది. కెర్రెర్ లో తన సాటి హీరోలకంటే బాగా వెనుకబడి పోయాడు. కొన్ని సినిమాలైతే మధ్యలోనే అటకెక్కాయి. ఇంకొన్ని ఏళ్లకు ఏళ్లు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి.

    ఐతే ఈ మధ్య కాస్త దారిలో పడ్డాడు రాబోయే ప్రమాదాన్ని గ్రహించుకొని తప్పులు సరిదిద్దుకుంటున్నాడు.అతి కష్టం మీద ఒక్కో సినిమాను క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు శింబు. గత ఏడాది 'వాలు' రిలీజైతే అయ్యింది గానీ శింబు రేంజ్ హిట్ కు నోచుకోలేదు. అదే సమయం, లోవచ్చిన "బీప్ సాంగ్" వివాదం మరింత ప్రభావం చూపించింది. కాగా తన కొత్త సినిమా 'ఎఎఎ' కోసం కూడా బాగానే కష్టపడుతున్నాడు. ఆ సినిమా లో శింబు చేయ బోయే ఒక క్యారెటర్ ర్ పై ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే....

    నిజానికి మంచి నటుడు:

    నిజానికి మంచి నటుడు:

    దక్షిణాది సినిమా ఇండస్ట్రీలలోనే ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదంలో ఉండే శింబు. నిజానికి మంచి నటుడు కావటం తో అవకాశాలకు ఎప్పుడూ లోటుండదు. పేరున్న దర్శకులు అతడితో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఆ అవకాశాలన్నింటినీ సరిగ్గా వాడుకొని బుద్దిగా పనిచేసుకుంటే అసలు శింబూ లైఫే వేరుగ ఉండేది..

    ఇదు నమ్మ ఆళు:

    ఇదు నమ్మ ఆళు:

    నీ లవ్ ఎఫైర్లు.., నిర్మాతలతో గొడవలూ, ఆడవాళ్ల మీద వ్యాఖ్యలూ.., బీప్ సాంగ్.. డిస్ట్రిబ్యూటర్లతో గొడవలు.. ఇలా అనవసరమైన కాంట్రవర్శీలతో కెరీర్‌ను దెబ్బ తీసుకున్నాడు. ఐతే ఈ మధ్య చాన్నాళ్ల వాయిదా తర్వాత నయన తార తో కలిసి చేసిన సినిమా 'ఇదు నమ్మ ఆళు' సూపర్ హిట్టవడంతో మళ్లీ అతడి కెరీర్‌కు ఓ ఊపొచ్చింది. దాంతో కనీసం ఇప్పటినుంచైనా మళ్ళీ కెరీర్ మీద దృష్టి పెట్టాలనుకున్నాడు....

    ఎఎఎ:

    ఎఎఎ:

    ఈ ఏడాది 'ఇదు నమ్మ ఆలు' కూడా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఈ సినిమాతో మళ్ళీ ఒక్కసారిగా తన పాత స్థాయిని అందుకోగలిగాడు శింబు. ఇక 'సాహసం శ్వాసగా సాగిపో' తమిళ వెర్షన్ 'అచ్చం ఎన్బదు మదమాయిద'ను కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాలెన్స్ ఉన్న ఒక పాటను శింబు ఈ మధ్యే పూర్తి చేశాడు.అచ్చం ఎన్బదు మదమాయిద ఖచ్చితంగా మంచి హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూండటం తో తన కొత్త సినిమా 'ఎఎఎ' కోసం కూడా బాగానే కష్టపడుతున్నాడు.

    60 ఏళ్ల ముసలివాడిగా:

    60 ఏళ్ల ముసలివాడిగా:

    'త్రిష ఇల్లాన నయనతార' ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు మూడు రకాల పాత్రలు పోషిస్తుండటం విశేషం. ఇందులో ఓ పాత్ర కోసం 60 ఏళ్ల ముసలివాడిగా కనిపిస్తాడట శింబు. అతడి బరువు కూడా 95 కిలోలుంటుందట. అందుకోసం శింబు బరువు పెరిగే పనిలో పడ్డాడట. అయితే దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవటానికి దాక్ట్ర్ల సలహాలు తీసుకుంటూనే ఫిట్నెస్ ట్రైనర్ల సమక్షం లోనే అధిక బరువు పెరిగే పనిలో ఉన్నాడట. ఇందులో వేయబోయే మూడు పాత్రల్లోనూ ఇదే కీలకమైనది కావటం తో దీని పైనే అందరి దృష్టీ ఉంది.

    వెరైటీ స్టోరీ:

    వెరైటీ స్టోరీ:

    ఇది వెరైటీ స్టోరీతో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్. ఈ సినిమా పూర్తి పేరు ‘అన్బానవన్..అసరాదవన్...అడంగాదవన్'. అంటే ...ప్రేమించేవాడు, భయపడనివాడు, లొంగనివాడు అని అర్ధం.ఆ మధ్య రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా థ్రిల్లింగ్ గా మూడు ముఖాలతో ఉంది. అది చూడగానే శింబూ ఖచ్చితంగా పని చేస్తే ఎలాంటి ఔట్ పుట్ ఇవ్వగలడో అందరికీ అర్థమైపోతోంది. తన లోని నటున్ని మరోసారి నిరూపించుకోవటాని శింబు బాగానే రిస్క్ తీసుకోవటానికీ సిద్ద పడ్డాడట

    టర్నింగ్ పాయింట్ కావచ్చు:

    టర్నింగ్ పాయింట్ కావచ్చు:

    మరో విశేషమేమంటే... ఈ సినిమాలో కేరక్టర్ చేసేందుకు శింబు బాగా బరువు పెరుగుతున్నాడట. ఈ మూవీలో అతను ఒక జైంట్ మాన్ లా కనబడాల్సి ఉంది. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ పిక్చర్ శింబుకు టర్నింగ్ పాయింట్ కావచ్చని కూడా అంటున్నారు.

    తొలిసారి ముసలివాడి పాత్ర:

    తొలిసారి ముసలివాడి పాత్ర:

    ఆ మధ్య 'సైజ్ జీరో' అనుష్క ఇలాగే బాగా బరువు పెరిగి.. మళ్లీ తగ్గడానికి అష్టకష్టాలు పడింది. మరి శింబు ఏం చేస్తాడో చుూడాలి. వయసు మళ్లిన పాత్రల్లో నటించడం తమిళ హీరోలకు మహా సరదా. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. రూపం మార్చుకుంటారు. చాలా కష్టమైన మేకప్స్ ట్రై చేస్తుంటారు. శింబు ఇప్పటిదాకా ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. తొలిసారి ముసలివాడి పాత్ర వేయబోతున్నాడు.

    సెల్వీ అనే పాత్రలో శ్రియ:

    సెల్వీ అనే పాత్రలో శ్రియ:

    తమన్నా, శ్రియ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ సెట్ లో ఓ పాత కారుతో క‌లిసి ఫోటో దిగిన శ్రియ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. అంతే కాదండోయ్...ఈ ఫోటో మా ఫ‌స్ట్ కారు ఆర్ఎన్డీ 5761 జ్ఞాప‌కాల‌ను, డ్రైవింగ్ నేర్చుకున్న రోజుల‌ను గుర్తుచేస్తుంది అంటూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే...శింబు సినిమా కోసం శ్రియ చ‌క్క‌గా చీర‌లో చాలా అందంగా, సంప్ర‌దాయ‌బ‌ద్దంగా క‌నిపిస్తుంది. ఈ చిత్రంలో సెల్వీ అనే శ్రియ పాత్ర హృద‌యానికి హ‌త్తుకునేలా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు అధిక్ ర‌విచంద్ర‌న్ తెలిపారు.

    English summary
    "Simbu has put on a lot of weight (currently 95 kilos), as the role demanded it. He never asked me any question as to why I wanted him to do so,” Adhik says.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X