For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'బాద్‌షా' కోసం పాట పాడిన తమిళ స్టార్ హీరో

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌షా'. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం తమిళ హీరో శింబు ఓ పాటను ఆలపించారు. 'డైమండ్‌ గాళ్‌..' అంటూ సాగే హుషారైన పాటను ఆయన పాడారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త. 'బ్యాక్‌ బెంచ్‌ స్డూడెంట్‌' చిత్రం కోసం కూడా శింబు గాయకుడి అవతారం ఎత్తారు. ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగానే 'బాద్‌ షా' కోసం శింబు పాట పాడేందుకు అంగీకరించారని తెలుస్తోంది. వచ్చే నెలలో 'బాద్‌షా' పాటల్ని విడుదల చేస్తారు.

    హీరోల ఇమేజ్‌కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. శ్రీనువైట్ల గత చిత్రం 'దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్‌చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో 'బాద్‌షా' చేస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ . బండ్ల గణేష్ నిర్మాత.

    ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ- ''తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఎన్టీఆర్, కాజల్‌లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఆసక్తిగొలిపే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. 'బాద్‌షా'గా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు'' అని తెలిపారు.

    ''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

    English summary
    Tamil hero Simbu is making his presence felt in Telugu film industry with his voice. Now he sung ‘diamond girl’ song in NTR’s Baadshah. Thaman composes music. Baadshah is also simultaneously going through postproduction. The rerecording of first half is currently going on. Shooting of the film will be complete by 10 March, the music launch date. Baadshah directed by Seenu Vytla and produced by Ganesh Bandla is all set to release on 5 April.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X