‘మగధీర’ 50డేస్ రికార్డ్ ను క్రాస్ చేసిన ‘సింహా’ !?
50 డేస్ సెంటర్స్ సంఖ్యలో 'మగధీర" నెలకొల్సిన రికార్డ్ ని క్రాస్ చేసేసి సరికొత్త చరిత్రను సృష్టిస్తూ 50డేస్ సెంటర్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది 'సింహా". తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి ఇంతకు ముందు వరకూ 302 సెంటర్స్ లో 50 డేస్ ప్రదర్శింపబడ్డ చిత్రంగా 'మగధీర" రికార్డ్ నమోదై వుండగా 338కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం జరుపుకుంటూ ఆ రికార్డ్ ని తిరగరాసింది 'సింహా".
నేటి(జూన్ 18)తో దిగ్విజయంగా యాభై రోజలు పూర్తి చేసుకుంటోన్న 'సింహా" చిత్ర అర్థ శతదినోత్సవ కేంద్రాల వివరాలను రేపు అధికారికంగా ప్రకటించనుంది ఈ చిత్ర నిర్మాణ సంస్థ యునైటెడ్ మూవీస్. ఊరి పేర్లు, థియేటర్స్ పేర్లతో సహా వివరంగా వున్న 'సింహా" చిత్ర అర్థ శతదినోత్సవ కేంద్రాల వివరాల కొరకు రేపటి వరకూ వేచి చూడాల్సిందే.
సింహా బాలకృష్ణ నయనతార నమిత స్నేహ ఉల్లాల్ మగధీర రామ్ చరణ్ తేజ్ simha balakrishna nayantara namitha sneha ullal magadheera ram charan teja


Click it and Unblock the Notifications