బాలయ్య 'సింహా' 50 రోజుల పంక్షన్ కి ఎన్టీఆర్
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'సింహా' రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని ఈ రాత్రి(23 జూన్) హైదరాబాద్ లో హోటల్ మారియట్ లో జరపనున్నారు. నిర్మాతలు ఇందునిమిత్తం భారీగా ఏర్పాట్లు చేసారని తెలుస్తోంది. బాలకృష్ణతో ఆహ్వానంపై ఆయనకు ఆత్మీయులైన సినీ ప్రముఖులు ఈ పంక్షన్ లో పాల్గొనబోతున్నారని సమాచారం. అలాగే జూ ఎన్టీఆర్ కూడా ఈ పంక్షన్ లో పాల్గొనబోతున్నారు. వికారాబాద్ లో బృందావనం షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఉత్సాహంగా, చాలా ఎక్సైట్మెంట్ తో ఈ పంక్షన్ లో పాలుపంచుకోనున్నారు.
More from Filmibeat
జూ ఎన్టీఆర్ సింహా బోయపాటి శ్రీను బాలకృష్ణ బృందావనం సమంత jr ntr brindavanam balakrishna samantha boyapati srinu


Click it and Unblock the Notifications











