చంద్రబాబు గెస్ట్ గా 'సింహా' ఆడియో విజయోత్సవం...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ముఖ్య అతిథులుగా 'సింహా' ఆడియో విజయోత్సవం జరపనున్నాం అంటూ సింహా' నిర్మాత పరుచూరి కిరీటి మీడియాకు తెలియచేసారు. నందమూరి బాలకృష్ణ. హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మిస్తోన్న చిత్రం 'సింహా'. నయనతార, స్నేహాఉల్లాల్, నమిత నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. వాటికి శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 16న ఈ చిత్రం ఆడియో విజయోత్సవం జరపనున్నారు.
ఈ విశేషాలను నిర్మాత పరుచూరి కిరీటి మీడియాకు తెలియజేస్తూ-"చక్రి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. అన్ని పాటలకు మంచి స్పందన వస్తోంది. అన్ని ఏరియాల నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ ఆడియో సాధించిన విజయాన్ని పురస్కరించుకొని ఈ నెల 16న హైదరాబాద్‌లోని రాక్‌గార్డెన్స్‌లో ఆడియో విజయోత్సవాన్ని జరపనున్నాం.
ఆడియో సాధించిన విజయం చిత్రం విజయంపై మరింత నమ్మకాన్ని పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నాం' అన్నారు. ఈ పంక్షన్ లో బాలకృష్ణతో పాటు చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు.


Click it and Unblock the Notifications











