బాలకృష్ణ ‘సింహా’ను ఇవివి బురిడి కొట్టిస్తాడట!
బాలకృష్ణ తాజా సినిమా'సింహా' విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ చిన్న సినిమాలన్నీ పక్కకు తప్పుకుంటున్న తరుణంలో, అదేం కుదరదు అంటూ దర్శకుడు ఇవివి సత్యనారాయణ మాత్రం తన కొత్త సినిమా 'బురిడీ' ని 'సింహా' విడుదలవుతున్న రోజే (ఏప్రిల్ ౩౦) విడుదల చేస్తున్నాడు. అయినా ఇవివి 'బురిడి' సినిమా మొదలుపెట్టిన రోజే ఏప్రిల్ ౩౦న ఈ సినిమా విడుదలవుతుందని చెప్పాడనుకోండి ఆది వేరే విషయం. చాలా కాలం తరువాత బాలయ్య 'సింహా'తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతాడు అని అందరూ ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇవివి మాత్రం ఇవేవీ లెక్కపెట్టకుండా 'బురిడి' విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.
గతంలో తన దర్శకత్వంలోనే వచ్చిన హిట్ చిత్రం 'ఎవడిగోల వాడిదే' కి సీక్వెల్ గా ఈ 'బురిడి' ని రూపొందించారని తెలుస్తోంది. తెలుగు సినిమా రంగంలోని అందరు ప్రముఖ హాస్యనటులు ఉన్న ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ హీరో. చిన్న సినిమాలలో రికార్డు సృష్టిస్తూ వంద ప్రింట్లతో ఈ 'బురిడి' విడుదల కాబోతోంది. ఒకే రోజు ఎదురుపడబోతోన్న 'సింహా'న్ని 'బురిడి' కొట్టించి ఇవివి గట్టెక్కుతాడో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











