'సింహా' తో పోటీ పడలేకే దిల్ రాజు ఆ నిర్ణయం
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' చిత్రం విజయవంతం కావటంతో దిల్ రాజు తన లేటెస్ట్ చిత్రం రామ రామ కృష్ణ కృష్ణ రిలీజ్ ను వాయిదా వేసారు. మే 12న ఈ చిత్రం విడుదల అవుతుందని ప్రకటన చేసారు. మొదట అనుకున్న ప్రకారం రామ రామ కృష్ణ కృష్ణ...మే 7న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే డిఐ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, అందుకే పోస్ట్ ఫోన్ చేస్తున్నారని ప్రకటన చేసారు. అయితే బాలకృష్ణ చిత్రంతో పోటీ పడటం ఇష్టం లేకనే దిల్ రాజు ఈ నిర్ణయానికి వచ్చాడని అంతర్గత వర్గాల సమాచారం. ఇక రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాన్ని లక్ష్యం వాసు డైరక్ట్ చేసారు. రామ్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, బిందు మాధవి హీరోయిన్స్ గా చేసారు. సీనియర్ హీరో అర్జున్ అశోక్ దేవగా ఇందులోకీ రోల్ లో కనిపిస్తారు. రామ్, అర్జున్ ల మధ్య ఉండే సన్నివేశాలు థ్రిల్లింగ్ గా ఉంటాయని దర్శక, నిర్మాతలు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











