ఊహించని విధంగా ఉత్తరాంధ్రలో కలెక్షన్ల ఉప్సెనని రప్పించిన ‘సింహా’
వైజాగ్ ఏరియాని క్లాస్ సెంటర్ గా భావిస్తయి సినీ వర్గాలు. మన ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తర్వాత క్లాస్ సినిమాలకి మంచి మార్కెట్ వుండేది వైజాగ్ లోనే. అయితే యూత్ చూడరు, ఫ్యామిలీస్ రారు అనిపించుకుని పక్కా మాస్ సినిమాగా ముద్ర వేసుకున్న 'సింహా" తరగని వసూళ్ల ఉదృతితో ఉత్తరాంధ్రని ఊపెస్తుండడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ఊహించని విధంగా ఉత్తరాంధ్రలో కలెక్షన్ల ఉప్సెనని రప్పించిన 'సింహా" ప్రస్తుతానికైతే అక్కడ 'మగధీర"ని అధిగమించేసిందనే చెప్పాలి. అదెలాగంటే...షేర్స్ పరంగా అగ్రస్థానం 'మగధీర" చిత్రానిదే అయినప్పటికీ గ్రాస్ కలెక్షన్స్ రూపంగా నెంబర్ వన్ ప్లేస్ కి చేరింది 'సింహా". 62 రోజులకు 'మగధీర" కలెక్ట్ చేసిన గ్రాస్ 5 కోట్ల 2 లక్షల 30వేలు కాగా అదే 62 రోజులకు 'సింహా" వసూలు చేసిన గ్రాస్ 5కోట్ల 7 లక్షల 28 వేలుగా నమోదైంది. లాంగ్ రన్ లో మళ్ళీ 'సింహా" వెనుకబడే అవకాశాలున్నాయి కానీ ఇప్పటికైతే వైజాగ్ రికార్డ్ 'సింహా"దే...


Click it and Unblock the Notifications











